అల్లు అర్జున్ కాన్ఫిడెంట్ మాములుగా లేదు
Setting New Benchmarks For World Cinema - Allu Arjun
పుష్ప పార్ట్ 1, పార్ట్ 2 తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ రాకా చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్, అలాగే రిలీజ్ డేట్ పై అభిమానుల ఒత్తిడి మాములుగా కనిపించడం లేదు. రీసెంట్ గా రాకా చిత్రం నుంచి వచ్చిన మేకింగ్ గ్లింప్స్ లోని విజువల్స్ ని హాలీవుడ్ అవతార్ విజువల్స్ తో పోల్చడం చర్చనీయాంశం అయ్యింది.
అలాగే రీసెంట్ గా రాకా గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా సాధించింది. అయితే ఆ రికార్డు కోసం మేకర్స్ ఏర్పాటు చేసిన మీటింగ్ ని స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చారు. అందులో అల్లు అర్జున్ ఇచ్చిన స్టేట్మెంట్ వైరల్ గా మారింది. రాకా విషయంలో అల్లు అర్జున్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడంటే ఖచ్చితంగా గ్లోబల్ స్టాండర్డ్స్ లో రాకా నిలవబోతుంది అని అని ప్రామిస్ చేస్తున్నాడు.
దానితో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాకా తో గ్లోబల్ వైడ్ గా ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసే విధంగా రాకా ని తెరకెక్కిస్తున్నాం, ఇది ఇండియన్ స్టాండర్డ్స్ కాదు గ్లోబల్ మార్క్ చేస్తున్నామని కాన్ఫిడెంట్ గా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
















































