మలయాళ ఇండస్ట్రీని ఫాలో అయితే బెటర్
It would be better to follow the Malayalam film industry
నిజమే టాలీవుడ్ మేకర్స్ మలయాళ ఇండస్ట్రీని ఫాలో అయితే బెటర్ అనే మాట వినిపిస్తుంది. అంటే చిన్న బడ్జెట్ తో పెద్ద హిట్లు అని కాదు.. ఓటీటీ ల విషయంలో మలయాళ ఇండస్ట్రీ ని టాలీవుడ్ ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు. మాములుగా మలయాళంలోనూ నాలుగు వారాల గడువుతోనే ఏ సినిమా అయినా థియేటర్ నుంచి ఓటీటీ కి వస్తుంది.
ఇక టాలీవుడ్ లోను అదే జరుగుతుంది. కానీ థియేటర్స్ లో ఇంకా ఇంకా కలెక్షన్స్ వస్తున్న సినిమాని కూడా ముందు చేసుకున్న ఒప్పందం అంటూ నాలుగు వారాలకే ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తున్నారు టాలీవుడ్ నిర్మాతలు కానీ మలయాళ ఇండస్ట్రీ ఆ ఒప్పందాన్ని బ్రేక్ చేసింది అది కూడా నివిన్ పౌలి బెత్లెహెం కుటుంబ యూనిట్ చిత్రంతో.
బెత్లెహెం కుటుంబ యూనిట్ థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాదు, ఈ చిత్రం మలయాళ ఇండస్ట్రీ హిట్ గా అద్భుతమైన రికార్డ్ క్రియేట్ చేసింది. దానితో మేకర్స్ ఓటీటీ విడుదల తేదేనిని వాయిదా వేశారు. లేదంటే ఈపాటికే బెత్లెహెం కుటుంబ యూనిట్ చిత్రం ఓటీటీ లో స్ట్రీమింగ్ కి రావాల్సిన చిత్రం.
ధియేట్రికల్ రన్ ఉండడంతో ఇంకా థియేటర్స్ నుంచి కలెక్షన్స్ వస్తుండడంతో నిర్మాతలు బెత్లెహెం కుటుంబ యూనిట్ ఓటీటీ రిలీజ్ డేట్ ని వాయిదా వేశారు. కానీ ఇరుముడి చిత్రం థియేట్రికల్ రన్ ముగియకుండానే ఓటీటీ లోకి తెచ్చేసారు. అందుకే టాలీవుడ్ నిర్మాతలు మలయాళ ఇండస్ట్రీ ని ఫాలో అయితే బెటర్ అనే కామెంట్స్ మొదలయ్యాయి.
















































