ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Iran uses Balakrishna to mock US President Trump

భగవంత్ కేసరి వీడియోతో ట్రంప్ పై ఇరాన్ సెటైర్

Iran uses Balakrishna to mock US President TrumpIran uses Balakrishna to mock US President Trump


గత కొన్ని నెలలుగా అమెరికా, ఇరాన్ నడుమ యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ట్రంప్ కవ్వింపు చర్యలకు ఇరాన్ గట్టి బుద్ది చెబుతుంది. ట్రంప్ ఈగో తో ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ట్రంప్ ఇరాన్ తో శాంతి చర్చలు అంటూనే కయ్యానికి కాలు దువ్వుతున్నాడు.

అయితే ఇరాన్ ట్రంప్‌ను ఎద్దేవా చేసేందుకు ఇరాన్ రాయబార కార్యాలయం బాలకృష్ణ సూపర్ హిట్ చిత్రం భగవంత్ కేసరి లోని ఓ యాక్షన్ ఎపిసోడ్ ని పోస్ట్ చేసి ట్రంప్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించడం చర్చనీయాంశమైంది. X వేదికగా జింబాంబ్వే లోని ఇరాన్ రాయబార కార్యాలయం ఓ పోస్ట్ చేసింది. ట్రంప్ ఇరాన్‌ను నాశనం చేయడం గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇరాన్ చిన్న దేశం కాదు, నిస్సహాయ దేశం అంతకన్నా కాదు అని ట్రంప్ కి తెలుసు.

ఇది మేం చెప్పినప్పటి నుంచి ట్రంప్ హాలీవుడ్‌ సినిమాలకు బదులు ఇండియన్ సినిమాలు చూస్తున్నారు అంటూ తెలుగులో నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరిలోని యాక్షన్ క్లిప్‌ను షేర్ చేసింది. దానితో ఇప్పుడు ఈ భగవంత్ కేసరి మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది.

US-Iran war: What is Balakrishna Connection