సడన్ గా ట్రెండ్ అవుతున్న టాక్సిక్ మూవీ
Toxic trending on twitter
కన్నడ స్టార్ యశ్ హీరోగా భారీ బడ్జెట్ తో భారీ అంచనాలతో ఆగష్టు 26 న పాన్ ఇండియా మార్కెట్ లో విడుదలైన టాక్సిక్ చిత్రం సడెన్ గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం హాట్ టాపిక్ అయ్యింది. టాక్సిక్ చిత్రం రిలీజ్ అయిన నెక్స్ట్ మినిట్ నుంచే విపరీతమైన డివైడ్ టాక్ స్ప్రెడ్ అయ్యి సోషల్ మీడియా జనాలకు ట్రోల్ కంటెంట్ గా మారింది.
అసలు టాక్సిక్ ఓటీటీ రిలీజ్ ని కూడా మరిచిపోయిన జనాలు సడన్ గా టాక్సిన్ ని గుర్తు తెచ్చుకోవడం చర్చనీయాంశం అయ్యింది. ప్రస్తుతం టాక్సిక్ ట్విట్టర్ X లో ట్రెండ్ అవుతుంది. కారణం ప్యారడైజ్. గత రాత్రి ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ది ప్యారడైజ్ చిత్రం చూసిన వారు టాక్సిక్ ని గుర్తు చేసుకుంటున్నారు.
ఇది ప్యారడైజ్ కాదు కిచిడి, ప్యారడైజ్ కన్నా బెటర్ టాక్సిక్, ఇది ప్యారడైజ్ కాదు-ఆశీర్వాదం యాడ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. దానితో టాక్సిక్ మూవీ సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వచ్చేసింది.
















































