సర్దార్ 2 ఓవర్సీస్ టాక్
Sardar 2 Overseas Talk
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ-దర్శకుడు పీఎస్ మిత్రన్ కలయికలో హిట్ మూవీ సర్దార్ కు సీక్వెల్ గా తెరకెక్కిన సర్దార్ 2 నేడు సెప్టెంబర్ 10 న ప్రపంచ వ్యాప్త ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులోనూ ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ తో సర్దార్ 2 తెలుగు ఆడియన్స్ ముందుకు రాగా.. ఓవర్సీస్ లో సర్దార్ 2 ప్రీమియర్స్ పూర్తి కావడంతో ఈ చిత్రంపై ఓవర్సీస్ ఆడియన్స్ తమ స్పందనను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు.
ఓవర్సీస్ టాక్ లోకి వెళితే.. కార్తీ డ్యూయల్ రోల్‌లో బాగా ఆకట్టుకున్నాడు, రెండు పాత్రల్లో వేరియేషన్ చూపించాడు. ఫస్ట్ హాఫ్ ప్రామిసింగ్‌గా ఉంది, సినిమా మొదటి ఫ్రేమ్ నుంచే ఛేజ్‌తో ఆసక్తికరంగా సాగుతుంది, కార్తి యంగ్ కేరెక్టర్ కమ్ ఇంట్రో, ఓల్డ్ సర్దార్ ఎంట్రీ అదిరిపోయాయి అంటూ ఓ ప్రేక్షకుడు ట్వీట్ చేసాడు.
సర్దార్ 2 ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా ఉన్నప్పటికీ, కేరెక్టర్స్ ఇంట్రడక్షన్, కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు ఆకట్టుకున్నాయని, ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం అదిరిపోయినా.. సెకండాఫ్ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది, సాగదీసిన సన్నివేశాలు ఇబ్బంది పెట్టేస్తాయి, కానీ కార్తీ తన యాక్టింగ్ తో మాయ చేసాడు, ఎస్ జె సూర్య కేరెక్టర్ అంతగా ఆకట్టుకోలేదు అంటూ మరో ఆడియెన్ ట్వీట్ చేసాడు.
సర్దార్ 2 ఓవర్‌డన్‌గా ఉంది, వీక్ విజువల్స్, నిడివి, లాజిక్ లేని రైటింగ్, మ్యూజిక్, ఫస్ట్ పార్ట్‌లో ఉన్నంత ఇంపాక్ట్ పార్ట్ 2 లో కనిపించలేదని కొంతమంది ఆడియన్స్ చెబుతున్నారు. ఓవరాల్ గా సర్దార్ 2 ఎలా ఉందొ పూర్తి సమీక్షలో మరికాసేపట్లో..







































