ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Preity Zinta reveals Bollywood's focus has changed to India’s pride and history

టెక్నాలజీ పెరిగినా టెన్షన్ తగ్గలేదు!

Preity Zinta reveals Bollywood's focus has changed to India’s pride and historyPreity Zinta reveals Bollywood's focus has changed to India’s pride and history

బాలీవుడ్  నటి ప్రీతి జింటా ఇటీవల సినిమా పరిశ్రమలో వచ్చిన మార్పులు, సాంకేతిక పురోగతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాలంతో పాటు నిర్మాణం, మేకింగ్ శైలి పూర్తిగా మారిపోయాయి అన్నారు. అయితే నటీనటులు , సాంకేతిక నిపుణులపై ఉండే మానసిక ఒత్తిడి మాత్రం ఏమాత్రం తగ్గలేదని  పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు అధునాతన కెమెరాలు, అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి రావడంతో సినిమా చిత్రీకరణ ప్రక్రియ ఎంతో సులువుగా మారినప్పటికీ పని వాతావరణంలో ఉండే టెన్షన్లు మాత్రం అలానే ఉన్నాయని  వ్యాఖ్యానించారు.

`ఒకప్పుడు సినిమాను తెరకెక్కించడానికి నెలల తరబడి సమయం పట్టేదని, సెట్‌లో ప్రతి ఒక్కరి మధ్య సుదీర్ఘమైన సంభాషణలు, అనుబంధాలు ఉండేవి అని గుర్తు చేసుకున్నారు. కానీ నేటి డిజిటల్ యుగంలో వేగం పెరిగిందని, కంటెంట్‌ను త్వరగా పూర్తి చేయాలనే ఆరాటం ఎక్కువైందన్నారు. సాంకేతికత వల్ల పని సులువైనా? దానికి తోడు సోషల్ మీడియా, నిరంతర పబ్లిసిటీ   ప్రేక్షకుల అంచనాలు పెరిగిపోవడంతో నటులపై ఉండే ఒత్తిడి రెట్టింపు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే వినోదాత్మక రంగమైనప్పటికీ దాని వెనుక ఎంతోమంది కష్టం, రాత్రింబవళ్లు పడే శ్రమ దాగి ఉంటాయని ప్రీతి జింటా పేర్కొన్నారు. మేకింగ్ టెక్నిక్స్ మారినా? ఒక కథను ప్రేక్షకుడి హృదయానికి హత్తుకునేలా చెప్పడంలో ఉండే సవాలు ఎప్పుడూ ఒకేలా ఉంటుందన్నారు. సినీ పరిశ్రమ ఎంత ఆధునికీకరణ చెందినా? ఆ రంగుల ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి పడే మానసిక ఒత్తిడిని అధిగమించడమే నటీనటులకు అసలైన పరీక్ష అని  ముగించారు.
 

Preity Zinta