సూర్య కిరణాలతో మెరుస్తున్న కృతి శెట్టి

Krithi Shetty Glows In Sun-KissedKrithi Shetty Glows In Sun-Kissed


మూడు భాషల్లో అపజయాలు మూటగట్టుకుని.. తనని హీరోయిన్ ని చేసిన టాలీవుడ్ నే మళ్లీ నమ్ముకున్న బేబమ్మ కృతి శెట్టి ఈ మద్యన సోషల్ మీడియాలో యాక్టీవ్ అయ్యింది. క్రేజీ ఫొటోస్ వదులుతుంది. గ్లామర్ షో చేస్తుంది. అయినప్పటికి అమ్మడు కెరీర్ లో ఉన్న ప్లాప్ లు ఆమెకు ఛాన్స్ లు రాకుండా చేస్తున్నాయి.

తెలుగులో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన కృతి శెట్టి కి ఆతర్వాత తెలుగు, తమిళం, మలయాళం ఇలా ఆమె నటించిన ప్రతి భాషలోనూ ఆమెకు నిరాశే మిగిలింది. ఇక తనని హీరోయిన్ గా నిలబెట్టిన తెలుగులో కృతి శెట్టి ప్రస్తుతం నటిస్తుంది. జనవరి 12 విడుదల అనే క్రేజీ టైటిల్ తో కళ్యాణ్ రామ్ సరసన కనిపించనుంది.

తాజాగా కృతి శెట్టి సూర్య కిరణాలను ఆస్వాదిస్తూ కనిపించింది. లూజ్ హెయిర్, డీ గ్లామర్ గా సూర్య కిరణాల నడుమ మెరుస్తూ దర్శనమిచ్చింది. అది చూసిన ఆమె అభిమానులు సన్ కిస్సెడ్ బేబీ అంటూ ముద్దుగా కామెంట్ చేస్తున్నారు. 

Krithi Shetty