ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Mohanlal’s L367 officially titled Operation Ganga

ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో డేంజ‌ర‌స్ విల‌న్!

Mohanlal’s L367 officially titled Operation GangaMohanlal’s L367 officially titled Operation Ganga

మోహన్‌లాల్ కథానాయకుడిగా మేప్పడియాన్ ఫేమ్ విష్ణు మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం `ఆపరేషన్ గంగ`. ఉక్రెయిన్-రష్యా యుద్ధ సమయంలో అక్కడ చిక్కుకున్న దాదాపు 23,000 మంది భారతీయ వైద్య విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ద్వారా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ మలయాళ చిత్రసీమలోకి అడుగుపెడుతుండటం విశేషం. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, ఆదిల్ హుస్సేన్ మరియు పార్తిబన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

విష్ణు మోహన్  జార్జియాలో  మూడు నెలల పాటు సాగే షూటింగ్ షెడ్యూల్‌లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ `అర్జున్ రాంపాల్‌ను మలయాళంలోకి తీసుకురావడానికి గతంలోనూ ప్రయత్నాలు జరిగాయి. కానీ ఈ కథ , కథనం ఆయనకు బాగా నచ్చడంతో వెంటనే అంగీకరించారు` అని తెలిపారు. ప్రతి పాత్ర అవసరానికి తగ్గట్టుగానే నటీనటులను ఎంపిక చేశామని, కేవలం ఇతర భాషల నటులు కావాలనే ఉద్దేశంతో ఎవరినీ తీసుకోలేదని స్పష్టం చేశారు.

ఈ భారీ డ్రామాకు సరికొత్త సాంకేతిక బృందం పని చేస్తోంది. `ధురంధర్` ఫేమ్ సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్‌దేవ్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తుండగా `పుష్ప` చిత్రాలకు పనిచేసిన పోలిష్ సినిమాటోగ్రాఫర్ మిరోస్లావ్ కుబా బ్రోజెక్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. విద్యార్థులు, అధికారులను సంప్రదించి సమగ్రమైన పరిశోధన చేసి కథను సిద్ధం చేశామని, వాస్తవ సంఘటనలకు అద్దం పడుతూనే అవసరమైన సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నామని దర్శకుడు వెల్లడించారు.
 

Mohanlal and Vishnu Mohan's film gets titled Operation Ganga