కాకా: అమ్ములు పాపగా అనస్వర రాజన్

Anaswara Rajan first look from KAAKAnaswara Rajan first look from KAAK

 

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్ తర్వాత ప్రతిష్టాత్మక చిత్రం ‘కాకా’తో రాబోతున్నారు. భారీ స్థాయిలో హై-ఇంటెన్సిటీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌లో మెగాస్టార్ ను రెండు డిఫరెంట్ షేడ్స్‌లో చూపించడంతో సినిమాపై మాస్‌లో భారీ క్రేజ్ ఏర్పడింది.

ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అనస్వర రాజన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. చేతుల్లో పుస్తకాలు, వైట్ కోట్, స్టెతస్కోప్, భుజంపై బ్యాక్‌ప్యాక్‌తో సింపుల్‌, అమాయకంగా కనిపించే అమ్మాయిగా అనస్వరను ప్రజెంట్ చేశారు. ఆమె సింపుల్ లుక్ పోస్టర్‌కు ఎంతో సహజమైన ఫీల్‌ను తీసుకురావడంతో పాటు, ఆమె మెడికల్ కాలేజ్ స్టూడెంట్ పాత్రకు తగ్గట్టుగా ఉంది.

ఆమె వెనుక పడిన నీడ పోస్టర్ మూడ్‌ను పూర్తిగా మార్చేస్తోంది. గోడపై మెగాస్టార్ చిరంజీవి సిల్హౌట్ కనిపిస్తూ, అనస్వర సాఫ్ట్, చీర్‌ఫుల్ అప్పియరెన్స్‌కు ఆసక్తికరమైన కాంట్రాస్ట్‌ను క్రియేట్ చేస్తోంది. అనస్వరను రక్షించడానికి చిరంజీవి ‘సత్యం’ పాత్ర అక్కడ ఉందని హింట్ ఇంస్తోంది. ఈ కంపోజిషన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.  
 

Anaswara Rajan