యశ్ టాక్సిక్ కి ఓటీటీ షాక్
OTT shock to Toxic
కన్నడ స్టార్ హీరో యశ్ కేజిఎఫ్ తర్వాత అంతకుమించిన ప్రాజెక్ట్ చెయ్యడానికి మూడేళ్ళ సమయం తీసుకున్నారు. కేజిఎఫ్ అంతటి హిట్ కొట్టాలని దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తో కలిసి టాక్సిక్ చేసారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం మొదటి నుంచి భారీ హైప్ తీసుకురాకపోయినా సినిమా విడుదల సమయానికి ముందు హ్యుజ్ బజ్ క్రియేట్ చేసుకుంది.
కానీ సినిమా విడుదలయ్యాక టాక్సిక్ చిత్రానికి పరమ ఘోరమైన డిజాస్టర్ టాక్ పడింది. అయితే టాక్సిక్ విడుదలకు ముందు ప్రముఖ ఓటీటీ సంస్థలు రెండు టాక్సిక్ డిజిటల్ రైట్స్ కోసం పోటీపడి రూ.150 కోట్ల ఆఫర్ ని నిర్మాతల ముందు పెట్టగా టాక్సిక్ ప్రొడ్యూసర్స్ రూ.200 కోట్లపై కూర్చున్నారని తెలుస్తుంది.
దానితో వెనక్కి తగ్గిన ఓటీటీ లు టాక్సిక్ విడుదలయ్యాక రిలాక్స్ అయ్యాయని అంటున్నారు. టాక్సిక్ కి రూ.150 కోట్ల డీల్ వద్దన్న నిర్మాతలకు, యశ్ కు ఇప్పుడు ఓటీటీ డీల్ చూసి షాక్ తగిలిందట. జీ 5 సంస్థ టాక్సిక్ చిత్రం విడుదలయ్యాక కేవలం రూ.30 కోట్లకు డిజిటల్ రైట్స్ అడుగుతుందట. మరి నిజంగా ఇది యశ్ కి షాక్ అనే చెప్పాలి, అప్పుడే రూ.150 కోట్లు కు ఇచ్చేస్తే నిర్మాతలు ఇప్పుడు సేవ్ అయ్యేవారు. కానీ రూ.30 కోట్లు అంటే నిజంగా షాకింగ్ విషయమే.







































