ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Irumudi achieved a career-best for Ravi Teja

ఈ వారం ఇరుముడి దే

Irumudi achieved a career-best for Ravi TejaIrumudi achieved a career-best for Ravi Teja


అవును ఈ వారం కూడా థియేటర్స్ దగ్గర ఇరుముడి హోరు కనిపించాల్సిందే. ఇరుముడి కి అన్ని అలా కలిసొచ్చేస్తున్నాయ్. సినిమా విడుదలకు ముందు మంచి హైప్ వచ్చింది. దానితో రవితేజ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ పడ్డాయి. రెండు రోజులకే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యింది. నాలుగు రోజులకే రూ.100 కోట్ల క్లబ్బులోకి చేరింది.

ఆరో రోజు ఇరుముడి కి టాక్సిక్ రూపంలో ఎఫెక్ట్ పడింది. అయినప్పటికి ఇరుముడి కి మళ్లీ కలిసొచ్చింది. ఎలా అంటారా.. టాక్సిక్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో డిజాస్టర్ టాక్ వచ్చింది. అది ఆ నెక్స్ట్ డే నుంచే ఇరుముడి మళ్లీ ఊపు చూపించింది. రేపు శుక్రవారం రాఖి పౌర్ణమి తెలంగాణాలో హాలిడే.

ఇక ఈ వారం చిన్న సినిమా కిక్కు చిరంజీవి, నయనతార డబ్బింగ్ మూవీ హాయ్ మాత్రమే విడుదలవుతున్నాయి. అవి అంత వర్కౌట్ అయ్యే సినిమాలు కావు. సో ఈ వారం కూడా రవితేజ ఇరుముడిదే హవా కనిపిస్తుంది. ఈ లాంగ్ వీకెండ్ లో ఇరుముడి అలా అలా రూ.200 కోట్ల క్లబ్బులోకి చేరిపోయేలా ఉంది. మరి ఇరుముడి అదృష్టం ఎలా ఉందొ చూద్దాం. 

Irumudi