వైరల్ అవ్వాలి అంటే గుండు కొట్టించుకోవాలా?
Sahaa heroine Swetha challenge to the audience
ఈమధ్యన చిన్న సినిమాల నటులు, దర్శకులు తమ సినిమాలను ప్రమోట్ చేసుకునే క్రమంలో స్టేజ్ ఎక్కి పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ పాస్ చెయ్యడం పరిపాటిగా మారిపోయింది. తమ సినిమా చూడమని, బావుంది అని చెప్పేందుకు చెప్పుతో కొట్టుకోవడం, లేదంటే చచ్చిపోతా అని బెదిరించడం, హిట్ అవ్వకపోతే ఇది చేస్తా అది చేస్తా అంటూ చెప్పడం చూస్తున్నాం.
నిజంగానే చిన్న సినిమాలు ఏదో విధంగా వైరల్ అవ్వకపోతే థియేటర్స్ కి వెళ్లి ఆడియన్స్ సినిమాలు చూసే స్కోప్ బాగా తగ్గిపోయింది. అందుకే వైరల్ అవడం కోసం ఏదో ఒకటి మాట్లాడుతూ ప్రేక్షకులను తమవైపు తిప్పుకోవాలనుకుంటున్నారు. అందులో కొన్ని వర్కౌట్ అయితే మరికొన్ని మిస్ ఫైర్ అవుతున్నాయి.
ఈరోజు గురువారం జరిగిన ఓ ఈవెంట్ లో ఆ సినిమాలో నటించిన హీరోయిన్ ఈ సినిమా ఆడకపోతే అమీర్ పేట సెంటర్ లో గుండు కొట్టించుకుంటా అంటూ ఛాలెంజ్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. అబ్బాయిలు ఛాలెంజ్ చెయ్యడం వేరు, ఓ నటి గుండు కొట్టించుకుంటా అని ఛాలెంజ్ చెయ్యడం వేరు.
సహ ట్రైలర్ లాంచ్ వేడుకలో నటి శ్వేత తమ సినిమా పై ఎంత నమ్మకం ఉందొ అని చెప్పే క్రమంలో సెప్టెంబర్ 4 న విడుదలయ్యే తమ సినిమా కనక ప్రేక్షకులను నిరాశపరిస్తే అమీర్ పేట్ సెంటర్ లో గుండు చేయించుకుంటానని చెప్పి షాకిచ్చింది. సినిమాపై విపరీతమైన నమ్మకం వేరు, అమ్మాయి ఇలాంటి ఛాలెంజ్ చెయ్యడం వేరు.
ఇప్పుడు సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుందో అనే విషయంలో, ఇంకా శ్వేతా ఛాలెంజ్ విషయంలో ప్రేక్షకుల్లో ఎంతోకొంత ఆసక్తి వచ్చినా.. అది ఎంతవరకు అనేది ఓపెనింగ్స్ డిసైడ్ చెయ్యాల్సిందే.







































