టాక్సిక్ ఫస్ట్ డే కేక.. తర్వాత !

Toxic First Day CollectionsToxic First Day Collections

 

వీక్ మిడిల్ లో బుధవారం డేర్ చేసి సినిమాని విడుదల చేసారు కన్నడ స్టార్ హీరో యశ్. మిలాద్ ఉన్ నబీ హాలిడే కావడం, ఈ శుక్రవారం రాఖి పౌర్ణమి హాలిడే కావడంతో యశ్ టాక్సిక్ చిత్రాన్ని ఆగష్టు 26 న విడుదల చేసారు. విడుదలకు ముందు భారీ హైప్ తో టికెట్స్ తెగాయి. ఓపెనింగ్స్ రోజు అదిరిపోయే హౌస్ ఫుల్స్ వచ్చాయి.

వరల్డ్ వైడ్ గా ఈ పాన్ ఇండియా ఫిలిం టాక్సిక్ రూ. 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఆ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ పోస్టర్ వేసి ప్రకటించారు. టాక్సిక్ ప్రభంజనం.. ఓపెనింగ్స్ లో షాకిచ్చే నెంబర్లు అంటూ పోస్టర్ వేసి అనౌన్స్ చేసారు. అయితే నిన్న విడుదలైన ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో సోషల్ మీడియా తెరిస్తే చాలు అర్ధమవుతుంది.

మరి టాక్సిక్ ఫస్ట్ డే కేకో కేక. కానీ సెకండ్ డే పరిస్థితి ఏమిటి. ఈ టాక్ తో టాక్సిక్ ఇకపై థియేటర్స్ లో ఎలా నిలబడుతుంది అనేది పెద్ద ప్రశ్నగా తయారైంది. ఎంతగా యశ్ స్టామినా పని చేసినా ఈ టాక్ తో నిర్మాతలు బయటపడడమైతే కష్టమే. 

Toxic First Day Collections Poster Out