బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2 వరస్ట్

Bigg Boss Agnipariksha 2 is the worstBigg Boss Agnipariksha 2 is the worst


బిగ్ బాస్ పై కొన్ని సీజన్స్ నుంచి పలు విమర్శలొస్తున్నాయి. హౌస్ లోకి వెళ్లి మధ్యలో ఎలిమినేట్ అయినవారు బిగ్ బాస్ పై హోస్ట్ నాగార్జున పై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 మొదలు కాకముందే అగ్నిపరీక్ష 2 తోనే బిగ్ బాస్ పలు విమర్శలు మూటగట్టుకుంటుంది.

అగ్నిపరీక్ష 2 జరుగుతుంది. అయితే అగ్నిపరీక్ష 2 నుంచి రిజెక్ట్ అయిన కంటెస్టెంట్స్ బిగ్ బాస్ పై, జెడ్జిలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కొద్దో గొప్పో పేరున్న ఇన్ఫ్లుయెన్సెర్స్ అగ్నిపరీక్షలో గెలిచి సీజన్ 10 హౌస్ లోకి వెళ్లాలని చూస్తున్నారు. అందులో రిజెక్ట్ అయిన వారు యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలో కూర్చుని అగ్నిపరీక్షపై ఫైర్ అవుతున్నారు.

అందులో భాగంగా ఓ లాయర్ డ్రైవర్ అగ్నిపరీక్ష 2 లో రిజెక్ట్ అవడమే కాదు.. ఆయన్ను బిగ్ బాస్ అగ్నిపరీక్షలో చాలా వరెస్ట్ ప్రశ్నలు అడిగారంటూ చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. తనని అగ్నిపరీక్ష జెడ్జి లు పర్సనల్ విషయాలు అడగాలి కానీ.. మీకు ఎన్ని అక్రమ సంబంధాలు ఉన్నాయి, మీకు పెళ్ళికి ముందు ఎన్ని అఫైర్స్ ఉన్నాయి అంటూ అడిగారు.

అంతేకాదు నువ్ అమ్మాయివా, అబ్బాయివా అని అడిగారు, నాకు పెళ్ళై ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. బిగ్ బాస్ కి వెళ్లి సాధించి బయటికి రావాలి అనుకున్నాను, కానీ అవసరం లేని విషయాలు అడిగి అగ్నిపరీక్ష టీం అవమానించింది అంటూ ఫైర్ అవుతున్నారు.

Bigg Boss Agnipariksha 2