నెల గ్యాప్ లో చిరు నుంచి రెండు సినిమాలు
Megastar Chiranheevi Vishwambhara
మెగాస్టార్ చిరంజీవి నెల గ్యాప్ లో అభిమానులకు రెండు ట్రీట్స్ ఇవ్వబోతున్నారా.. అంటే అవుననే అంటున్నారు. ఈ దసరాకు మెగాస్టార్ చిరు - వశిష్ట కలయికలో తెరకెక్కుతున్న విశ్వంభర రిలీజ్ ఉండొచ్చనే ఊహాగానాలు ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. ఒకవేళ దసరా కి విశ్వంభర రిలీజ్ ఉండి ఉంటె చిరు బర్త్ డే కి ఆ డేట్ క్లారిటీ దర్శకుడు వశిష్ట ఇచ్చేవారు.
విశ్వంభర కు సంబంధించి విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో వశిష్ట ఆ రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్ ని కంటిన్యూ చేసారు. అయితే విశ్వంభర డిసెంబర్లో విడుదల చెయ్యొచ్చని అంటున్నారు. అంటే విశ్వంభర డిసెంబర్ అనుకుంటే.. మరో నెల గ్యాప్ లో జనవరి లో సంక్రాంతి కి చిరు కాక గా రాబోతున్నారు.
రీసెంట్ గానే చిరు బర్త్ డే కి కాక టైటిల్ గ్లింప్స్ వదిలారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కాక సంక్రాంతి విడుదల అంటూ అఫీషియల్ గా డేట్ లాక్ చేశారు మేకర్స్. మరి విశ్వంభర విషయమే తేలడం లేదు. సో విశ్వంభర డిసెంబర్లో గనక వస్తే మరో నెల గ్యాప్ లో కాక తో మెగా ఫ్యాన్స్ కి రెండు పండగలన్నమాట.







































