అందరి చూపు నయన్ పైనే!
Nayanthara - Toxic
రేపు శనివారం బెంగళూరులో జరగబోయే టాక్సిక్ ట్రైలర్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలియదు కానీ.. ఆ ఈవెంట్ లో కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార పాల్గొంటుందా లేదా అనే విషయంలో చాలామందిలో చాలా క్యూరియాసిటీ కనిపిస్తుంది. కారణం నయనతార సినిమా ప్రమోషన్స్ కు అటెండ్ కాదు.
కానీ టాక్సిక్ చిత్రం పాన్ ఇండియా మూవీ. టాక్సిక్ లో ఆమె హీరోయిన్ కాదు, నయనతార ది కీలక పాత్ర. అలాంటి హీరోయిన్ నయనతార టాక్సిక్ ఈవెంట్ లో కనిపిస్తే సినిమాకి హైప్ పెరుగుతుంది. మరి టాక్సిక్ మేకర్స్ నయనతారకు ఎక్కువ పారితోషికం ఇచ్చి ఆమెను టాక్సిక్ ప్రమోషన్స్ కి ఏమైనా తీసుకొస్తారా అనే విషయంలోనూ ఆసక్తి ఉంది.
బెంగుళూరు లో భారీగా జరగబోయే ఈవెంట్ లో యశ్ పక్కన నయన్ కూడా కనిపిస్తే ఆ క్రేజే వేరు. అదే చాలామంది కోరుకుంటున్నది. మరి నయన్ వస్తుందా, రాదా అనేదే అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఇక టాక్సిక్ ట్రైలర్ వచ్చాక సినిమాపై ఓ క్లారిటీ వస్తుంది అని అనుకుంటున్నారు. కారణం ఇప్పటివరకు టాక్సిక్ పై ఎటువంటి పోజిటివిటి లేదు. చూద్దాం టాక్సిక్ ట్రైలర్ విషయమేమిటో అనేది.







































