రాకా: దుబాయ్ సెటప్ తో ముంబై లోనే
Raaka shooting update
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో హాలీవుడ్ రేంజ్ లో రాకా చిత్రాన్ని చేస్తున్నారు. ప్రస్తుతం ముంబై లోనే రాకా షూటింగ్ చిత్రీకణ చేస్తున్నారు. మేజర్ పార్ట్ షూటింగ్ ముంబై లోనే వేసిన స్పెషల్ సెట్స్ లో జరుగుతుంది. రీసెంట్ గానే అల్లు అర్జున్ ఫ్యామిలీ వెకేషన్ కు బ్రేక్ తీసుకుని మళ్ళీ హైదరాబాద్ లో ఫ్యాన్స్ మీట్ పెట్టాక ముంబై తిరిగి వెళ్లి రాకా షూట్ లో జాయిన్ అయ్యారు.
రాకా చిత్రానికి సంబందించిన దుబాయ్ షెడ్యూల్ ఒకటి చెయ్యాల్సి ఉంది. కానీ ఇరాన్ వార్ తో దుబాయ్ షెడ్యూల్ చెయ్యడానికి కుదరకపోయేసరికి రాకా టీం, దుబాయ్ లో చెయ్యాల్సిన షూట్ ని ముంబై లో భారీ సెట్ వేసి ముగించేస్తున్నారు. దాదాపుగా ఒకే ఏరియా లో సెట్స్ వేసి రాకా షూటింగ్ ను అట్లీ ముగిస్తున్నారు. ఆ లొకేషన్ ఈ లొకేషన్ అంటూ తిరగకుండా మొత్తం ముంబై లోనే రాకా షూట్ చిత్రీకరిస్తున్నారు.
ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న బాలీవుడ్ భామ దీపికా పదుకోన్ కూడా తన భాగానికి సంబంధించిన షూటింగ్ ని ఆల్మోస్ట్ పూర్తి చేసేసింది. ఆమె ప్రెగ్నెంట్ కావడంతో దీపికా పార్ట్ ని అట్లీ ముందుగానే కంప్లీట్ చేశారు. మరోపక్క ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలను హాలీవుడ్ విఎఫ్ఎక్స్ (VFX) స్టూడియో చూసుకుంటుండగా, వారి సాంకేతిక అవసరాలకు తగినట్లుగా ముంబైలో ఒక భారీ సౌండ్ స్టేజ్ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారట రాకా మేకర్స్.
కాబట్టే రాకా చిత్రానికి భారీ బడ్జెట్ పెడుతున్నారని, అలాగే నటుల పారితోషికాలు భారీగా ఉండబోతున్నట్లుగా బాలీవుడ్ మీడియా టాక్.







































