వారణాసి లీక్స్ - ఆ విషయంలో నో టెన్షన్
Varanasi Leaks
సోషల్ మీడియాలో వారణాసి వీడియో లీకై సంచలనం సృష్టించింది. మహేష్ బాబు పై చిత్రీకరిస్తున్న కొన్ని సన్నివేశాల విజువల్స్ లీకయ్యాయి. వాటిని చాలామంది వైరల్ చేసారు. దానితో మహేష్ ఫ్యాన్స్ లో ఆందోళన కనిపించింది. దర్శకుడు రాజమౌళి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ లీకులు ఆగట్లేదు అంటూ మధనపడ్డారు.
అయితే తాజాగా వారణాసి నుంచి లీకైన వీడియో విషయంలో టెన్షన్ పడాల్సిన పని లేదు అంటున్నారు. కారణం వారణాసి నుంచి లీకైన ఆ వీడియో ఫుటేజ్ సినిమాలో ఉండదట. ఆగస్టు 9 సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే కోసం చేసిన స్పెషల్ వీడియో అది అంటున్నారు. అంటే ఆ లీకైన వీడియో నే సూపర్ స్టార్ బర్త్ డే కి ట్రీట్ అన్నమాట.
సో ఆ లీకెడ్ ఫుటేజ్ పై మహేష్ ఫ్యాన్స్ ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని తెలుస్తుంది. దీనిని బట్టి మహేష్ బర్త్ డే కి వారణాసి నుంచి ఓ పవర్ ఫుల్ వీడియో అయితే రాబోతుంది అనేది ఇలా కన్ ఫర్మ్ అయ్యిందన్నమాట.







































