పారడైజ్ టీజర్ : దిష్టాంతా పోవాలే
The Paradise Teaser Review
నేచురల్ స్టార్ నాని కెరీర్ లో హైయ్యెస్ట్ బడ్జెట్ తో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా ఫిలిం ది ప్యారడైజ్ మూవీ ఆగష్టు లో విడుదల అంటూ చెప్పినా ఇప్పుడు ఇది సెప్టెంబర్ 24 న విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేసారు. అది కూడా పవర్ ఫుల్ టీజర్ తో ప్యారడైజ్ రిలీజ్ డేట్ లాక్ చేసి ప్రకటించారు.
ఒక నిమిషం 35 సెకన్ల నిడివి గల ది ప్యారడైజ్ టీజర్ లోకి వెళితే.. నాని జడల్ లుక్ తో చేసిన విధ్వంశం టీజర్ కే హైలెట్ గా నిలిచింది. జడల్ పాత్రలో నాని చెప్పిన డైలాగ్లు ఈలలు వేయిస్తున్నాయి. ఇక నుంచి... ఈ జాగా ఎవరిది.. ఈ దేశం ఎవరిది... అని నాని చెప్పే డైలాగ్ ఊచకోత పెట్టెలా ఉంది.
ఛీ అని ఉమ్మేసిన ఆ గాఢమైన నలుపు రంగే, మన జెండా.. మాకే దానిమీద గుర్తు.. నువ్వనుకున్నట్టు కాదు.. మేం ఏంటో చూపిస్తాం.. అని నాని చెప్పే డైలాగ్.. హైలెట్ గా నిలవడమే కాదు టీజర్ చివరిలో నాని చేతికి బ్లేడ్స్ కట్టుకుని గుండాలను కుమ్మేసి వారిపై కూర్చుని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నలుగుడ్ల దిష్టి, బెదురుగుడ్ల దిష్టి అంటూ నాని చేసిన యాక్షన్ విన్యాసం టీజర్ మొత్తానికి హైలెట్ గానిలిచింది.
టీజర్ లో నాని యాక్టింగ్, లుక్స్, డైలాగ్ డెలివరీ కేక పుట్టించేలా ఉన్నాయి. మోహన్ బాబు విలనిజం, కాయదు లోహర్ అందాలు, అనిరుద్ BGM, విజువల్స్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని అన్ని ప్యారడైజ్ టీజర్ కి మెయిన్ హైలెట్స్ గా నిలిచాయి.







































