రామ్ చరణ్ ఫోన్ కాల్.. ట్రైనర్ కెరీర్‌నే మార్చేసిన వైనం!

Ram Charan

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తోటివారిని ప్రోత్సహించడంలోనూ ఎప్పుడూ ముందుంటారు. ఆయన చేసే పనులు, చూపించే చొరవ తరచూ ఇండ‌స్ట్రీలో ఎప్పటిక‌ప్పుడు చర్చనీయాంశమవుతుంటాయి. తాజాగా రామ్ చరణ్ చేసిన  చిన్న ఫోన్ కాల్ తన జీవితాన్నే పూర్తిగా మార్చేసింద‌రి   ఓ ప్రముఖ సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ భావోద్వేగంతో వెల్లడించారు. తాను కష్టపడి వర్కవుట్లు చేసుకుంటున్న సమయంలో రామ్ చరణ్ నుంచి వచ్చిన అనూహ్యమైన కాల్ తన ప్రొఫెషనల్ లైఫ్‌లో మైలురాయిగా నిలిచిందని  గుర్తుచేసుకున్నారు.

గ్లోబల్ స్టార్ స్థాయి వ్యక్తి నుంచి నేరుగా ఫోన్ వచ్చేసరికి మొదట తాను షాకయ్యానని, ఆ సంతోషాన్ని తట్టుకోలేక వెంటనే ప్రముఖ నటి తమన్నాకు ఫోన్ చేసి ఆ విషయాన్ని పంచుకున్నానని  ట్రైనర్ తెలిపారు. తన ఫిట్‌నెస్ ప్రయాణంలో రామ్ చరణ్ చూపిన నమ్మకం తనపై బాధ్యతను మరింత పెంచిందని చెప్పారు. స్టార్ ఇమేజ్ అడ్డం పెట్టుకోకుండా సాధారణ వ్యక్తులకు ఇచ్చే గౌరవం, అందించే ప్రోత్సాహం రామ్ చరణ్‌ను ప్రత్యేకంగా నిలబెడతాయని  కొనియాడారు.

తన వృత్తి జీవితంలో ఊహించని మలుపు తెచ్చిన ఈ మధుర జ్ఞాపకాన్ని నెమరువేసుకుంటూ ఆ ట్రైనర్ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. తెరవెనుక టెక్నీషియన్లు, ట్రైనర్ల కష్టాన్ని గుర్తించి వెన్నుతట్టే హీరోల తీరు ఎంతోమందికి స్ఫూర్తినిస్తుందని అభిప్రాయపడ్డారు. రామ్ చరణ్ లాంటి అగ్ర హీరో అందించిన ఆ గుర్తింపు తన జీవితంలో ఎప్పటికీ మ‌ర్చిపోలేని బహుమతి అని పేర్కొన్నారు.

Ram Charan