జన నాయగన్ రూ.300 కోట్లు దాటిందా?
Jana Nayagan - Box Office Collection
కోలీవుడ్ స్టార్ హీరో కమ్ తమిళనాడు సీఎం విజయ్ చివరి చిత్రంగా జులై 23 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన జన నాయగన్ చిత్రానికి పాజిటివ్ టాక్ రాలేదు కానీ.. ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించింది. తెలుగులో జన నాయగన్ ప్లాప్ చిత్రంగా మిగిలిపోయింది. ఈ మిక్స్డ్ టాక్ తోనే జన నాయగన్ కలెక్షన్స్ రూ.300 కోట్లు దాటేశాయని సోషల్ మీడియాలో ప్రచారం ఉంది.
కానీ జన నాయగన్ మేకర్స్ ఎక్కడా అఫీషియల్ పోస్టర్ మాత్రం వెయ్యలేదు. ఇక విజయ్ ఫ్యాన్స్ కి జన నాయగన్ రూ.300 కోట్లు కొల్లగొట్టింది అన్న ఆ ఉత్సాహమే లేదు. విజయ్ తన చివరి చిత్రాన్ని ఇంకాస్త మంచి సినిమా చెయ్యాల్సింది, దానితో మంచి ఫేర్ వల్ ఇచ్చేవాళ్లమని ఫ్యాన్స్ బాధ.
ఇప్పుడేమో జన నాయగన్ నిజంగా రూ.300 కోట్ల క్లబులోకి వెళ్లిందా అనే అనుమానపు మాటలతో విజయ్ ఫ్యాన్స్ మరింతగా బాధపడుతున్నారు. జన నాయగన్ మేకర్స్ అదేదో అఫీషియల్ గా అనౌన్స్ చేస్తే బావుంటుంది అంటున్నాడు. మరి విజయ్ చివరి చిత్రం రూ.300 కోట్లు కొల్లగొట్టడం హ్యాపీనే. కానీ ఇంకా మంచి సినిమా చేసి ఉంటె రూ.1000 కోట్లు వచ్చేవి, అదే వారి బాధ.







































