ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rashmika Shares Recovery Update After Hip Injury

కోలుకుంటున్న రష్మిక మందన్న!

Rashmika Shares Recovery Update After Hip Injury

నేషనల్ క్రష్ రష్మిక మందన్న సినిమాలకు విరామం ఇచ్చి ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి పెట్టారు. ఇటీవల భుజానికి అయిన గాయం .. ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా కొద్ది రోజులుగా షూటింగ్స్‌కు దూరంగా ఉంటున్నారు. అయితే సోషల్ మీడియా ద్వారా  ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన అప్‌డేట్స్‌ను అభిమానులతో ఎప్ప‌టిక‌ప్పుడు పంచుకుం టున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా తన రికవరీ జర్నీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ప్రస్తుతం దినచర్య పూర్తిగా మారిపోయిందని తెలిపారు. రోజంతా నిద్రపోవడం, శరీరం కోలుకోవడానికి తగిన విశ్రాంతి తీసుకోవడం ..ఎక్కువ సమయం  కుటుంబ సభ్యులతో గడపడమే  ప్రధాన పనులుగా మారాయని ర‌ష్మిక పేర్కొ న్నారు. నిత్యం క్షణం తీరిక లేకుండా వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉండే  క్యూట్ బ్యూటీకి అనూహ్య విశ్రాంతి కుటుంబంతో గడిపేందుకు  మంచి అవకాశంలా మారిందని చెప్పొచ్చు.

అభిమానులు త‌న  ఆరోగ్యం గురించి ఆందోళన చెందొద్ద‌ని త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మరింత ఉత్సాహంగా తిరిగి సెట్స్‌లోకి అడుగుపెడతానని ధైర్యం చెప్పారు. వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్న ర‌ష్మిక‌  రికవరీ పీరియడ్ తర్వాత మరింత ఎనర్జిటిక్‌గా రీఎంట్రీ ఇస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

Rashmika Mandanna shares health update after hip injury