బిగ్‌బాస్‌పై మల్లికా షెరావత్ సంచలన వ్యాఖ్యలు
Mallika Sherawat's sensational comments on Bigg Boss
బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రియాలిటీ షోల గురించి పలు ఆసక్తికర విష యాలు పంచుకున్నారు. తాను భవిష్యత్తులో ఎప్పటికీ `బిగ్‌బాస్` షోలో పాల్గొనబోనని .. ఆ షో ఫార్మాట్ తనకు ఎలాంటి ఆసక్తి లేదని ..మళ్లీ గేమ్‌లోకి అడుగుపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కెరీర్, వ్యక్తిగత ఎంపికల విషయంలో తానెప్పుడు స్పష్టతతో ఉంటానని పేర్కొన్నారు. మరోవైపు తాను నటిస్తోన్న `ది ట్రైటర్స్ 2` రియాలిటీ షో గురించి స్పందించారు.
ఈ ప్రాజెక్ట్ కోసం అత్యధిక పారితోషికం అందుకుంటున్నట్లు మల్లికా షెరావత్ ధృవీ కరించారు. పారితోషికం విష యంలో రాజీపడనని, తన ఇమేజ్ కు తగ్గ ఫీజ్ కచ్చితంగా ఛార్జ్ చేస్తానన్నారు. మార్కెట్ విలువను బట్టే ఏ ప్రాజెక్ట్ నైనా అంగీకరిస్తానని తెలిపారు. ప్రస్తుతం ఓటీటీ ..వివిధ రియాలిటీ షోల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న మల్లికా షెరావత్ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. కంటెంట్ ఆధారిత ప్రాజెక్ట్‌లతో పాటు తన స్థాయికి తగిన ఆఫర్లను మాత్రమే ఎంపిక చేసుకుంటున్నారనేది ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది.
ఇక మల్లికా షెరావత్ రెండేళ్లగా సినిమాలు లేక ఖాళీగా ఉంటోంది. అమ్మడి వయసు కూడా 50 ఏళ్లు రావడంతో అవకాశాలు తగ్గాయి. ఐంటం పాటల్లో హీరోయిన్లే నటిస్తుండటంతో? ఐటం భామలకు డిమాండ్ తగ్గింది. దీంతో ఆ ప్రభావం మల్లికా షెరావత్ పై కూడా పడింది. ప్రస్తుతం సినిమాలకంటే టెలివిజన్ షోలతోనే ఎక్కువగా బిజీగా ఉంటోంది.







































