శూర్పణఖ మోడ్రెన్ లుక్

Rakul Preet trendy look goes viral


ప్రస్తుతం బాలీవుడ్ రామాయణ చిత్రంలో శూర్పణఖ గా కనిపించనున్నరకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. శూర్పణఖ గా రకుల్ లుక్స్, ఆమె అందానికి అందరూ మైమరిచిపోతున్నారు. శూర్పణఖ ఇంత అందంగా ఉంటుందా అనే రేంజ్ లో ఆమెను దర్శకుడు చూపించారు.

రామాయణ ట్రైలర్ లో శూర్పణఖ గా రకుల్ ని అందరూ పొగిడేశారు. మరి ఈ శూర్పణఖ మోడ్రెన్ లుక్ లో కనిపిస్తే అది వైరల్ అవకుండా ఉంటుందా, రకుల్ తాజాగా వైట్ మోడ్రెన్ కాస్ట్యూమ్ లో ట్రెండీ గా కనిపించింది. లుక్ హెయిర్ చక్కటి ఫిట్ నెస్ తో రకుల్ ఆ వైట్ మోడ్రెన్ వేర్ లో అద్దరగొట్టేసింది.

ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా వున్న రకుల్ ప్రీత్ రామాయణ చిత్రం తర్వాత సౌత్ లోకి రీ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి. ఒకప్పుడు రకుల్ సౌత్ లో క్రేజీ అవకాశాలతో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. తర్వాత ఆమె సౌత్ కి దూరమై హిందీ కి దగ్గరైంది.
 

Rakul Preet Singh