Advertisement

సినిమా సెట్ లో రష్మిక కు ప్రమాదం

Rashmika Mandanna Injured


ప్రతి భాషలోనూ టాప్ హీరోయిన్ పొజిషన్ ని ఎంజాయ్ చేస్తున్న కన్నడ హీరోయిన్, తెలుగింటి కోడలు రష్మిక మందన్న ఓ సినిమా షూటింగ్ లో గాయపడడం ఆమె అభిమానులకు షాకిచ్చింది. రష్మిక చేతిలో నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతం భర్త విజయ్ దేవరకొండ తో కలిసి రణబాలి, హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ మైసా కి సంబందించి డాన్స్, యాక్షన్ సీక్వెన్స్ ల్లో మే పాల్గొంటుంది.

మైసా కోసం రష్మిక రిస్కీ స్టెంట్స్ చేస్తుంది. నిత్యం షూటింగ్ లో చాలా బిజీగా వున్న రష్మిక మందన్న తాజాగా డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది. ఆమె నడుము భాగంలో తీవ్రమైన గాయమైనట్లుగా డాక్టర్స్ గుర్తించారు. ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చి ఆరు వారాల పాటు విశ్రాంతి సూచించినట్లుగా సమాచారం.

అంతేకాకుండా టెండన్ తిరిగి బలపడేందుకు రీహాబిలిటేషన్ కూడా తప్పనిసరి అని చెప్పారట. ఈ ప్రమాదం నుంచి రష్మిక పూర్తిగా కోలుకున్నాకే ఆమె మళ్లీ షూటింగ్స్ కి హాజరవుతారని తెలుస్తుంది. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు పలువురు షూటింగ్ సెట్ లో గాయపడి విశ్రాంతిలో ఉన్న సంగతి తెలిసిందే.

Rashmika Mandanna has sustained a serious injury