ప్యారడైజ్ రెడీ అవుతోంది
The Paradise update
శ్రీకాంత్ ఓదెల-హీరో నాని కలయికలో రెండో ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిలిం ది ప్యారడైజ్. ఈ చిత్రం విడుదల విషయంలో మేకర్స్ సైలెన్స్ తో విపరీతమైన సస్పెన్స్ నడుస్తుంది. ఆగస్టు రిలీజ్ అంటూ మేకర్స్ ఎప్పుడో రిలీజ్ డేట్ లాక్ చేసి ఇప్పుడు కామ్ అయ్యారు.
ఇక ఈ చిత్రంలో కాయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్ లో కనిపిస్తుంది. ఇప్పటికే ఈ స్పెషల్ సాంగ్ షూట్ లో కీర్తి సురేష్ జాయిన్ అయ్యింది. అల్యూమినియం ఫ్యాక్టరీలో స్పెషల్ సెట్ వేసి ఈ పాటను ఐదు రోజుల పాటు తెరకెక్కిస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ సాంగ్ షూట్ పూర్తి కాబోతుంది. తాజాగా ఆగష్టు 6 న టీజర్ వదులుతున్నామంటూ క్రేజీ అప్ డేట్ అందించారు మేకర్స్.
అలాగే క్లైమాక్స్ ఫైట్ కూడా పూర్తవడం, టాకీ కూడా కంప్లీట్ అయినట్లుగా తెలుస్తుంది. షూటింగ్ ఓ కొలిక్కి రావడంతో ప్యారడైజ్ మేకర్స్ రిలీజ్ డేట్ లాక్ చేసేందుకు సిద్దమవుతున్నారు అని అది ఎప్పుడు అనేది త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది అని తెలుస్తుంది.








































