Advertisement

బాలయ్య వారసుడు కాదు వారసురాలు ఎంట్రీ

Tejaswini set for acting debut?



నందమూరి వారసుడు మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశంపై నందమూరి ఫ్యాన్స్ లో తీవ్ర ఉత్కంఠ నడుస్తుంది. మోక్షజ్ఞ గత రెండేళ్లుగా హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ వర్మ తో మోక్షజ్ఞ మూవీ అనౌన్సమెంట్ వచ్చినా అది ఆగిపోయింది. మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ఎలాంటి క్లారిటీ లేదు.

ఈ సమయంలోనే నందమూరి వారసురాలు అంటే బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని నటనలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది, సినిమాల్లోకి నటిగా ఇంట్రడ్యూస్ అవ్వబోతుంది అనే వార్త వైరల్ అయ్యి కూర్చుకుంది. ఎప్పటినుంచో బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని తండ్రి కి వెన్నంటే ఉంటుంది. అలాగే ఓ జ్యువెలరీ కోసం బ్రాండ్ అంబాసిడర్ గా మొహానికి మేకప్ వేసుకుంది.

తర్వాత ఆమె కొన్ని సాంగ్స్ కి డాన్స్ స్టెప్స్ వేస్తూ తనలోని మరో టాలెంట్ ని పరిచయం చేసింది. ఇప్పుడు ఆమె కెమెరా ముందుకు రాబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తేజస్విని సినీ ఎంట్రీ వార్త బయటకు రావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

అయితే తేజస్విని కేవలం గ్లామర్ పాత్ర కోసం కాదు.. కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రతోనే ఇంట్రడ్యూస్ అవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే తొలి సినిమాకే తేజస్విని స్పోర్ట్స్ డ్రామా వంటి కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారనే ప్రచారం సాగుతోంది. మరి నందమూరి వారసుడు ఇంట్రడ్యూస్ అవుతాడు అనుకుంటే ఇప్పుడు వారసురాలు వస్తోంది.

Nandamuri Tejaswini All Set for Debut?