Advertisement

తెలుగు కన్నా తమిళ్ బెటర్ - నిధి

Actress Nidhi Agarwal


తెలుగు సినిమాల్లో నటించి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న గ్లామర్ బ్యూటీ నిధి అగర్వాల్ కి ఆరు నెలల గ్యాప్ లో రెండు భారీ డిజాస్టర్స్ ఆమెను బాగా జప్పాయింట్ చేసాయి. సోషల్ మీడియాలో గ్లామర్ చూపిస్తూ కవ్వించే నిధి అగర్వాల్ కి ప్రస్తుతం తెలుగులో చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్స్ లేవు.

తాజాగా నిధి అగర్వాల్ టాలీవుడ్ కన్నా తమిళ్ బెటర్ అనే అర్ధం వచ్చేలా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తమిళనాట సరైన ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను, తమిళ్ సినిమాని బాగా మిస్ అవుతున్నాను అని చెప్పిన నిధి అగర్వాల్ మంచి దర్శకులతో అర్థవంతమైన పాత్రలు ఉన్న సినిమాలు చేయాలనుకుంటున్నాను.

అలాంటి కేరెక్టర్స్ చెయ్యడానికి తమిళ ఇండస్ట్రీ బావుంటుంది, అదే సరైన చోటు. నా లైఫ్ లో దేనికీ నేను తొందరపడను. పెళ్లి విషయంలో కూడా అంతే. మంచి ప్రాజెక్ట్ వస్తే.. సినిమాలు చేస్తాను.. అంటూ తెలుగు కన్నా తమిళం లోనే మంచి మంచి పాత్రలు ఉంటాయని నిధి అగర్వాల్ ఇండైరెక్ట్ గా తమిళ్ ఇండస్ట్రీని పొగిడేసింది.

Nidhi Agarwal