5 లక్షల చెక్కు కోసం నటనలోకి వచ్చాను
Rakul Preet Singhటాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కథానాయకి రకుల్ ప్రీత్ సింగ్ తన మొదటి పారితోషికం గురించిన ఆసక్తికర విషయాన్ని ఇటీవల వెల్లడించారు. తన మొదటి సినిమా గిల్లి (కన్నడ) చేస్తున్న సమయంలో పారితోషికం ఎంత అడగాలో కూడా తనకు సరిగ్గా తెలియదని రకుల్ పేర్కొన్నారు.
అయితే ఆ చిత్ర నిర్మాతలు తొలి పారితోషికంగా రూ. 5 లక్షల చెక్కును ఇచ్చారు. ఆ వయసులో అంత పెద్ద మొత్తంలో డబ్బు చేతికి అందడం తనకు ఎంతో సంతోషాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించిందని రకుల్ సరదాగా తెలిపారు.
ఆ మొదటి చెక్కు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాన్ని కూడా రకుల్ బయటపెట్టారు. ఆ డబ్బుతో సొంతంగా ఒక కారు కొనవచ్చని..తన ఫ్రెండ్స్ గ్రూప్‌లోనే కారు కొన్న మొదటి వ్యక్తిగా తాను నిలవవచ్చనే ఆలోచనతోనే ఆ సినిమా చేయడానికి అంగీకరించానని తెలిపారు. పాకెట్ మనీ కోసం చూసే వయసులో ఆ 5 లక్షల పారితోషికం తనకు పెద్ద కొండంత కొండంత అండగా అనిపించిందని... ఆ డబ్బుతో కారు కొనుక్కోవాలనే చిన్న కోరిక తీరడమే ఆ చిత్రంలో నటించడానికి ప్రధాన కారణమని రకుల్ స్వీట్ మెమొరీస్‌ను గుర్తుచేసుకున్నారు.








































