టాలీవుడ్ పై మరోసారి తమన్నా పైత్యం
It's A Very Specific Gaze: When Tamannaah
సౌత్ లో అందులోను టాలీవుడ్ సినిమాల్లో నటించి పేరు తెచ్చుకుని, కెరీర్ ని మలచుకుని, డబ్బు సంపాదించుకుని.. సెటిల్ అయ్యి తర్వాత అవకాశాలు తగ్గగానే హిందీ పరిశ్రమలో చిన్న చితకా ఆఫర్స్ కోసం సౌత్ ని విమర్శించే హీరోయిన్స్ ఈమధ్యన ఎక్కువైపోయారు. మిల్కి బ్యూటీగా సౌత్ ప్రేక్షకులు ఆరాధించిన తమన్నా టాలీవుడ్ పై రీసెంట్ గా పైత్యపు ఆరోపణలు చేసింది.
తాజాగా మరోసారి సౌత్ పై తమన్నా తన పైత్యాన్ని చూపించింది. ప్రస్తుతం తమన్నాకు సౌత్ అవకాశాలు తగ్గిపోయాయి. సౌత్ నుంచి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ ముంబై లోనే ఉంటూ హిందీ అవకాశాలు చేజిక్కించుకుంటూ బాలీవుడ్ ని ప్రశంసిస్తూ టాలీవుడ్ ని విమర్శిస్తూ అవకాశాలు అందుకుంటుంది. అందులో భాగంగా తమన్నా ఫోర్బ్స్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో..
బాలీవుడ్ లో ఒక నటిగా ఆయా పాత్రల్ని ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది, సాంగ్స్, డ్యాన్స్‌పై ఆసక్తిలేని.. అసలు వాటిలో అంతగా రాణించలేని నటుల్ని కూడా చూస్తుంటాం. కానీ వారు పాత్రలను పోషించే విషయంలో నటన పరంగా అద్భుతంగా రాణిస్తారు. బాలీవుడ్‌లో అయితే గ్లామర్ లేదంటే డ్యాన్స్, నటన ఇలా ఎవరికి ఏది ఇష్టమో దానిని ఎంపిక చేసుకోవచ్చు.
కానీ నేను సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు నాకు ఒక విషయం అర్ధమైంది. సౌత్ లో పురుషాధిక్యత, సినిమాను భిన్నంగా చూడటం ఇలా ఏదైనా సరే హీరోయిన్లకు కొన్ని పరిమితులు ఉన్నాయి అంటూ మరోసారి సౌత్ ని తక్కువ చేసి మట్లాడడంపై నెటిజెన్స్ తమన్నా పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.








































