ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా-సెలబ్రిటీల స్పందనలు!
Dharmendra Pradhan's Resignation – Celebrity Reactions!విద్యార్దుల నిరసనలతో కేంద్రం దిగొచ్చిన సంగతి తెలిసిందే. విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడంతో సీన్ ఒక్కసారిగా చల్లారింది. ఈ పరిణామంపై బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు షేర్ చేస్తున్నారు. గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా రాజీనామా స్పందించారు. సోషల్ మీడియాలో ప్రత్యేక ఎమోజీల ద్వారా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే యువ గాయకుడు అర్మాన్ మాలీక్ యువత శక్తి అంటూ ప్రశంసిస్తూ పోస్ట్ పెట్టారు. దేశంలో విద్యార్థులు .. యువత ఐక్యతతో పోరాడితే ఎలాంటి మార్పునైనా సాధించవచ్చని అభిప్రాయపడ్డారు.
విలక్షన నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. `యువత సాధించిన ఈ విజయం అద్భుతమని కొనియాడారు. ప్రభుత్వాలను కూడా తమ గళంతో గడగడలాడించవచ్చని దేశ యువత నిరూపించిందని పేర్కొన్నారు. కేవలం రాజకీయ నాయకులే కాకుండా, విద్యావేత్తలు , వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సైతం విద్యార్థుల పట్టుదలను మెచ్చుకుంటున్నారు. ఈ ఆందోళనల్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరి పోరాటం వల్లే ఈ కీలక నిర్ణయం సాధ్యమైందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
విద్యారంగంలో పారదర్శకతను కోరుతూ విద్యార్థులు చేపట్టిన శాంతియుత నిరసనలకు ఇండస్ట్రీ నుంచి మద్దతు లభించడం విశేషం. పరీక్షల నిర్వహణలో పదేపదే జరుగుతున్న పొరపాట్ల వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోందని.. దీనికి బాధ్యులైన వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని మేధావులు వాదిస్తున్నారు. ఈ రాజీనామా కేవలం ప్రారంభం మాత్రమేనని భవిష్యత్తులో విద్యా వ్యవస్థలో మరింత పకడ్బందీ సంస్కరణలు రావాలని ఆశిస్తున్నారు.








































