పూజ హెగ్డే ఆశలపై నీళ్లు
Jana Nayagan: PoojaHegde plays a press reporter in this film
వరస ప్లాప్ ల తర్వాత రెండేళ్ల గ్యాప్ తో తమిళ సినిమాల్తో రీ ఎంట్రీ ఇచ్చిన బుట్టబొమ్మ పూజ హెగ్డే కి రీ ఎంట్రీ కూడా కలిసి రాలేదు. మోనికా సాంగ్ తప్ప మిగతా సినిమాలేవీ పూజ హెగ్డే కి ఊరటనివ్వలేదు.. సరికదా ఆమెపై ఐరెన్ లెగ్ ముద్రపడిపోయింది. అయినా పూజ హెగ్డే తమిళంలో విడుదల కావాల్సిన జన నాయగన్ పై విపరీతమైన ఆశలు పెట్టుకుంది.
జన నాయగన్ తమిళనాట విడుదలకు ముందే పెద్ద హిట్ అనేలా ఆ సినిమా బుకింగ్స్ కనిపిస్తున్నాయి. దానితో పూజ హెగ్డే జన నాయగన్ తనకు హిట్ ఇచ్చి కెరీర్ కి హెల్ప్ అవుతుంది అని ఆశపడింది. కానీ జన నాయగన్ దర్శకుడు పూజ హెగ్డే ఆశలపై నీళ్లు చల్లారు. జన నాయగన్ చిత్రం బాలయ్య భగవంత్ కేసరికి రీమేక్ కాదని, ఓ 50 శాతం మాత్రం ఇన్స్పైర్ అయ్యామని చెప్పారు దర్శకుడు వినోద్...
జన నాయగన్ చిత్రంలో పూజా హెగ్దే జర్నలిస్టు పాత్ర పోషించింది. ఈ పాత్రను రాసుకునేటప్పుడు చాలా సీన్లు రాసుకున్నప్పటికి నిడివిని దృష్టిలో పెట్టుకొని అందులో చాలా సన్నివేశాలు అసలు షూట్ చేయలేదట. అంతేకాకుండా పూజ హెగ్డే తో షూట్ చేసిన సన్నివేశాల నుంచి కూడా కొన్నింటినీ కత్తిరించాల్సి వచ్చింది.
జన నాయగన్ లో పూజ హెగ్డే సీన్స్ ఎక్కువ ఉండవని చెప్పడమే కాదు ఆమెకు దర్శకుడు సారీ చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. మరి జన నాయగన్ పై ఎన్నో హోప్స్ పెట్టుకున్న పూజ హెగ్డే ఆశలపై నీళ్లు చెల్లినట్టే కదా... పాపం పూజ హెగ్డే!







































