బ్లాక్ శారీ లో శ్రీలీల బ్యూటిఫుల్ లుక్
Sreeleela's beautiful look in a black saree
క్యూట్ అండ్ స్వీట్ బ్యూటీ శ్రీలీల సోషల్ మీడియా లుక్స్ గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాలి. చీర కట్టినా, చుడిదార్ వేసినా చాలామందిలో ఆకర్షణ కనిపించదు. కానీ శ్రీలీల అలా కాదు. ఆమె గ్లామర్ గా రెడీ అయినా ముద్దుగా అంటుంది తప్ప ఎబ్బెట్టుగా ఉండదు. ఇక చీర కట్టులో శ్రీలీల ని చూస్తే వావ్ అనేలా ఉంటుంది.
తాజాగా బ్లాక్ లైట్ వెయిట్ పట్టు ఫ్యాన్సీ చీర లో శ్రీలీల ఇచ్చిన బ్యూటిఫుల్ ఫోజులకు యూత్ అల్లాడిపోతున్నారు. ఆ బ్లాక్ శారీ కి స్లీవ్ లెస్ బ్లాక్ బ్లౌజ్, చేతులకు నిండుగా గాజులు, మెడలో హెవీ జ్యువెలరీ తో శ్రీలీల లేటెస్ట్ లుక్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో అవకాశాలు రాని శ్రీలీల తమిళ సినిమాలు, అలాగే హిందీ ప్రాజెక్ట్స్ తో మాత్రం బిజీగా కనబడుతుంది. టాలీవుడ్ లో అమ్మడు మళ్లీ కనిపించాలంటే అది ఓ హిట్టు తోనే సాధ్యం. కానీ అవకాశాలు లేని శ్రీలీల టాలీవుడ్ కి ఎలా కమ్ బ్యాక్ ఇస్తుందో చూడాలి.







































