బాల బాబాయ్ త్వరగా కోలుకోవాలి-ఎన్టీఆర్
Get Well Soon Bala Babai Says NTR
నందమూరి బాలకృష్ణ ఈరోజు మంగళవారం కాకినాడ పోర్ట్ లో NKBK111 షూటింగ్ లో గాయపడిన విషయం తెలిసిందే. NBK 111 షూటింగ్ సెట్ లో ఓ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్న సమయంలో బాలయ్య కాలు జారి పడిపోవడంతో ఆయన్ని చిత్ర బృందం వెంటనే ఆసుపత్రి కి తరలించి చికిత్స ఇప్పించారు.
బాలయ్యకు పెద్దగా దెబ్బ తగల్లేదు అని, గాయం స్వల్పమే అయినా కొద్దిరోజులు అయన కొద్దిరోజులు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్టుగా గోపీచంద్ మలినేని సోషల్ మీడియాలో ట్వీట్ చేసారు. దానితో కంగారు పడిన నందమూరి అభిమానులు బాలయ్య త్వరగా కొలుకోవాలంటూ దేవుణ్ణి ప్రార్దిస్తున్నారు.
ఇక బాలయ్య అన్న హరికృష్ణ కొడుకులు, హీరోలు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు బాల బాబాయ్ త్వరగా కోలుకోవాలి అంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు వేశారు.
Jr NTR:
Get well soon Bala Babai. Wishing you a speedy recovery and good health. Looking forward to seeing you roar back in full form…
Kalyan Ram :
Get well soon Babai. ❤️
Wishing you a speedy recovery. I'm sure you will be back in action in no time, doing what you love the most.







































