అమితాబ్ ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన
Amitabh Bachchan has worried fans
బిగ్ బి అమితాబచ్చన్ ఎప్పుడు ఆసుపత్రికి వెళ్లినా ఆయన అభిమానుల్లో ఆందోళన కనిపిస్తుంది. ఆయన రొటీన్ చెకప్ కి వెళ్లినా సరే అభిమానులు భయపడిపోతారు. అమితాబ్ సోషల్ మీడియాలో రీసెంట్ గా తనకి సర్జరీ జరిగింది అంటూ చేసిన పోస్ట్ చూసి అభిమానుల్లో ఎన్నో రకాల అనుమానాలు, ఆందోళన కనిపించాయి.
ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ తనకు సర్జరీ చేసారని, కొన్ని రోజులు ICU లో ఉండి డిశ్ఛార్జ్ అయ్యా ను. ఈ ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు ఫిజికల్ గా, మెంటల్ గా, ప్రాక్టికల్ గా చాలా కష్టంగా ఉంటుంది. మీరు ఎంత గొప్ప వారైనా సరే ఒక రోజు ఓటమి మిమ్మల్ని పలకరిస్తుంది. ఇది అత్యంత క్లిష్టమైన దశ అంటూ అమితాబ్ చేసిన పోస్ట్ పై ఫ్యాన్స్ అసలు అమితాబ్ కి ఏమైంది, ఆయన త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి మొక్కుతున్నారు.
ఈ ఏజ్ లోను చాలా హుషారుగా సినిమా షూటింగ్స్ కోసం హైదరాబాద్, ముంబై అంటూ తిరిగే అమితాబ్ ఇలా మాట్లాడడమే అభిమానులను ఆందోళనకు గురి చేసింది. అసలు అమితాబ్ కి ఏమైంది, ఆయన ఎందుకిలా మాట్లాడారు అంటూ వారు కంగారు పడుతున్నారు.







































