టాక్సిక్ - ఇది మరీ టూ మచ్ అబ్బా

Toxic Movie


టాక్సిక్ చిత్రం యాక్షన్ ఎంటర్టైనరా లేదంటే ఏ గ్రేడ్ మూవీనా ఇదే చాలామంది ప్రేక్షకుల్లో కలుగుతున్న అనుమానం. టాక్సిక్ టీజర్ దగ్గర నంచి సాంగ్స్ వరకు హీరో యష్ ని హీరోగా చూపిస్తూ అమ్మాయిలను ఆటబొమ్మలుగా చూపించడమేమిటి, కియారా అద్వానీ తో ఆ రేంజ్ రొమాన్స్ చూపించారు. ఇప్పుడు తార సుతారియాతో.. ఇక నయనతార తో సిగరెట్ షేర్ చేసుకునేలా.. అసలు ఇది సినిమానా లేదంటే అంటూ టాక్సిక్ పై అందరూ కామెంట్లు పెడుతున్నారు.

సినిమాని హాలీవుడ్ రేంజ్ లో చూపించాలంటే అది వేరు. కానీ ఇలా రొమాన్స్ ని పీక్స్ లో చూపించేస్తే అది హాలీవుడ్ రేంజ్ అవుతుందా, దర్శకుడు గీతూ మోహన్ దాస్ ఓ మహిళ. ఆమె ఇలాంటి చిత్రాన్ని తెరకెక్కించడమా, యూత్ ని టార్గెట్ చేసి సినిమా తియ్యడమంటే ఇదేనా అంటూ నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు.

టాక్సిక్ మొత్తం బోల్డ్ కంటెంట్ మీదే ఆధారపడి తీశారా.. ఇది మరీ టూ మచ్ అంటూ సోషల్ మీడియాలో టాక్సిక్ కంటెంట్ పై కామెంట్లు పడుతున్నాయి. టాక్సిక్ ట్రైలర్ ఎలా కట్ చేసారో కానీ.. ఇప్పటివరకు టాక్సిక్ నుంచి వస్తున్న కంటెంట్ మొత్తం బోల్డ్ కంటెంట్.

అసలు ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని చూస్తారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ బోల్డ్ కంటెంట్ టాక్సిక్ చిత్రానికి ఎంత హెల్ప్ అవుతుందో జస్ట్ వెయిట్ అండ్ సి.

Toxic Movie Promotions