బాలయ్య కోసం పవర్ ఫుల్ లేడీ విలన్
Alluring beauty negative shades in NBK112
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో NBK 111 చిత్రం చేస్తున్నారు. ఇప్పటివరకు ఫుల్ స్వింగ్ లో సాగిన షూటింగ్ బాలయ్య కు చిన్న గాయమవడంతో స్మాల్ బ్రేక్ పడింది. ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చెయ్యాలనే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు.
ఈ చిత్రం తర్వాత బాలయ్య ఇమ్మిడియట్ గా కొరటాల శివ సినిమా సెట్ లోకి వెళ్ళిపోతారు. NBK 112 ప్రాజెక్ట్ రీసెంట్ గానే పూజ కార్యక్రమాలతో మొదలు పెట్టారు. అయితే ఈ చిత్రంలోకి ఓ లేడీ విలన్ పవర్ ఫుల్ ఎంట్రీ ఇవ్వబోతుంది అనే న్యూస్ వైరల్ అవుతోంది. ఆమె ఎవరంటే సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో టాలీవుడ్ లో చెరగని ముద్ర వేసిన ఐశ్వర్య రాజేష్.
బాలయ్య కి హీరోయిన్ గా కాకుండా ఆమె విలన్ గా NBK 112 ప్రాజెక్ట్ లో కనిపించనున్నట్లు సమాచారం. మెయిన్ విలన్ కాకపోయినా.. ఆమెది నెగెటివ్ షేడ్స్ ఉన్న కీలక పాత్ర అని తెలుస్తుంది. మరి ఐశ్వర్య రాజేష్ NBK 112 లో స్టైలిష్ లేడీ విలన్ గా కనిపిస్తుందా, లేదంటే మాస్ విలన్ గానా అనేది తెలియాల్సి ఉంది.







































