ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Anasuya Bharadwaj's stunning look viral

కలువ పువ్వుతో కత్తిలాంటి ఫోజులు

Anasuya Bharadwaj's stunning look viral


అనసూయ భరద్వాజ్ ఆమె పేరు తెలవని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఒకప్పుడు బుల్లితెర రాణి, ఇప్పుడు బుల్లితెరకు బ్రేక్ ఇచ్చి వెండితెరపై సత్తా చాటుతుంది. వరస సినిమాలు, పాన్ ఇండియా మూవీస్ తో అనసూయ బిజీగా ఉండడమే కాదు, మధ్య మధ్యలో షాప్ ఓపినింగ్స్ అంటూ హడావుడి చేస్తూ రెండు చేతులూ సంపాదిస్తుంది.

షాప్ ఓపినింగ్స్ విషయంలో చీర కట్టు లో కనిపించే అనసూయ ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా మాంగళ్య షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో టిష్యు కంచి బోర్డర్ చీర లో అదిరిపోయే ఫోటోలకు ఫోజులిచ్చింది. చేతిలో కలువ పువ్వు పట్టుకుని కత్తిలాంటి ఫోజులతో స్పెషల్ ఫోటో షూట్ తో మెస్మరైజ్ చేసింది.

ఇక అనసూయ ఎంత బిజీగా వున్నా తన ఫ్యామిలీకి కావాల్సిన సమయాన్ని కేటాయిస్తూ భర్త, కొడుకులతో వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తుంది. 

Anasuya Bharadwaj Latest Saree Look