అఖిల్ లెనిన్ సెకండ్ వీకెండ్ కలెక్షన్స్
Lenin Movie 10 Days Collections
అఖిల్ లెనిన్ చిత్రం విడుదలై పది రోజులైంది. లెనిన్ చిత్రం పై అభిమానులు పెట్టుకున్న అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అయ్యింది. లెనిన్ చిత్రంతో అఖిల్ హీరోగా నిలదొక్కుకోవడం అటు అక్కినేని ఫ్యామిలీకి ఇటు అక్కినేని అభిమానులకు బిగ్ రిలీఫ్ నిచ్చింది.
ఈరోజు అక్కినేని హీరోలు నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ లెనిన్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో అక్కినేని ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. అక్కినేని హీరోలందరిని ఒకే స్టేజ్ పై చూసేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు. ఈలోపే మేకర్స్ లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ పోస్టర్ వదిలారు.
లెనిన్ చిత్రం పది రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.88 కోట్ల గ్రాస్ తీసుకొచ్చినట్టుగా అఫీషియల్ పోస్టర్ వదిలారు. అది ఫుల్ రన్ లో లెనిన్ చిత్రం రూ.100 కోట్ల గ్రాస్ తీసుకురావాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు. మరి అఖిల్ కి రూ.100కోట్ల కల నెరవేరుతుందో, లేదో అనేది జస్ట్ వెయిట్ అండ్ వాచ్.







































