ఎంజీఆర్, ఎన్టీఆర్ త‌ర్వాత‌ ద‌ళ‌ప‌తే!

MGR, NTR, Vijay


సినిమా తారలు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన సందర్భాలు అనేకం ఉన్నా? అధికారంలో ఉన్న సమయంలోనే వారి సినిమాలు విడుదలవ్వడం  అరుదైన అంశం. ఈ అరుదైన ఘనతను గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.జి. రామచంద్రన్ (ఎంజీఆర్), తెలుగునాట నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) మాత్రమే సొంతం చేసుకున్నారు. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఈ అగ్రనటులు, రాజకీయాల్లోనూ అదే ప్రజాదరణతో శిఖరాగ్రానికి చేరుకుని.. తమ చిత్రాలను విడుదల చేసుకునే స్థాయిని సాధించారు.

ఈ అరుదైన జాబితాలో తాజాగా దళపతి విజయ్ కూడా  చేరుతున్నారు. ఇటీవ‌లే  తమిళనాడు ముఖ్య‌మంత్రిగా విజ‌య్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. పార్టీ స్థాపించి తొలి ఎన్నిక‌లోనే సీఎం అయి చ‌రిత్ర సృష్టించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న హీరోగా న‌టించిన `జ‌న నాయ‌గ‌న్` కూడా రిలీజ్ కు సిద్ద‌మ‌వ్వ‌డం విశేషం. ఇదే నెల‌లో ఆ సినిమా ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది. విజ‌య్ సీఎం అయిన త‌ర్వాత రిలీజ్ అవుతున్న తొలి చిత్రం కావ‌డంతో అంచ‌నాలు అంకంత‌కు రెట్టింపు అవుతున్నాయి.

సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారు సాధారణంగా రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ సినిమాలకు స్వస్తి పలుకుతుంటారు. కానీ ప్రజాదరణను ఏ మాత్రం కోల్పోకుండా?  అధికారాన్ని అలంకరించిన తర్వాత కూడా తన చిత్రాలను భారీ స్థాయిలో విడుదల చేయగలగడం విజయ్  పట్టుదలకు నిదర్శనం. ఇది  నటుడి విజయం మాత్రమే కాదు.  ఆయన పట్ల అభిమానుల్లో ఉన్న అచంచలమైన విశ్వాసానికి .. రాజకీయ-సినీ ప్రయాణంపై ఉన్న ఆదరణకు నిదర్శనంగా నిలుస్తోంది.

Tamilnadu CM Vijay