రామాయణ 3D ట్రైలర్ హైలైట్స్

Ramayana 3D trailer highlightsRamayana 3D trailer highlights

 

బాలీవుడ్ లో నితీష్ తివారి తెరకెక్కిస్తున్న రూ.4000 కోట్ల అతి భారీ బడ్జెట్ రామాయణ చిత్రానికి సంబందించిన ఫస్ట్ టీజర్ కి చాలా విమర్శలొచ్చాయి. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న రామాయణ చిత్రం పార్ట్ 1 ఈ దివాళి కి విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా రామాయణ 3D ట్రైలర్ ని నిన్న శనివారం రాత్రి ఢిల్లీ వేదికగా పలు భాషల జర్నలిస్ట్ లని ప్రత్యేకంగా ఆహ్వానించి రామాయణ టీమ్ ట్రైలర్ ని ప్రదర్శించింది.

మూడు నిమిషాల నిడివితో ఉన్న ఈ 3D ట్రైలర్ రావణ్ షార్ట్ తో ప్రారంభం కాగా.. రావణ్ గా యశ్ 100 పర్సెంట్ ఇచ్చేస్తే.. రాముడిగా రణబీర్ కూల్ పెరఫార్మెన్స్, సీత గా సాయి పల్లవి లుక్స్ వైజ్ గా కట్టుకుంది. ఈ ట్రైలర్ లో 3D షార్ట్స్ గురించి ప్రత్యేకంగా మట్లాడుకునేలా రామాయణ ట్రైలర్ కట్ ఉండడమే కాదు.. మేకర్స్ రూ.4000 కోట్లు బడ్జెట్ ఎందుకు పెట్టారో అర్ధమవుతుంది.

రామాయణ 3D ట్రైలర్ ని వీక్షించిన వారు ప్రత్యేకంగా సోషల్ మీడియాలో పొగుడుతూ.. వరల్డ్ క్లాస్ VFX ని చూడబోతున్నామంటూ ట్వీట్లు  వేస్తున్నారు. అఫీషియల్ గా రామాయణ ట్రైలర్ ఈ నెల 24 న విడుదల కాబోతుంది. ఇప్పటి నుంచి వరల్డ్ వైడ్ రామాయణ ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు.

Ramayana 3D trailer