ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sai Pallavi stuns in a traditional saree

స్టేజ్ ఏదైనా సాంప్రదాయం ఇంపార్టెంట్

Sai Pallavi stuns in a traditional saree

 

బాలీవుడ్ అంటేనే గ్లామర్. అక్కడి హీరోయిన్స్ ఎంత  గ్లామర్ చూపిస్తే అన్ని అవకాశాలోస్తాయని అలా గ్లామర్ ప్రదర్శిస్తారు. అందుకే సౌత్ హీరోయిన్స్ ముంబై లో అంటే బాలీవుడ్ ఇండస్ట్రీ లో అడుగుపెట్టగానే అక్కడి హీరోయిన్స్ ని తట్టుకుని ఛాన్స్ లు పొందాలని గ్లామర్ చూపించడానికి తెగ ఆరాటపడిపోతారు.

తమన్నా, రకుల్ ప్రీత్, కాజల్, రష్మిక ఇలా చాలామంది సౌత్ హీరోయిన్స్ గ్లామర్ షో కి ముంబై లో తెగ ఇంపార్టెన్స్ ఇచ్చినవారే. వేదిక ఏదైనా గ్లామర్ ఇంపార్టెంట్ అనేలా కనిపిస్తారు. కానీ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి మాత్రం వేదిక ఏదైనా సాంప్రదాయం ఇంపార్టెంట్ అంటుంది.

గత రాత్రి ఢిల్లీ లో జరిగిన రామాయణ ఈవెంట్ కి సాయి పల్లవి చక్కటి కంచి పట్టు చీరలో అది కూడా చాలా ట్రెడిషనల్ గా హాజరయ్యింది. రామాయణ కదా అందుకే సీత పాత్రధారి చీరకట్టులో పద్దతిగా వచ్చింది అనుకోవడానికి.. పక్కనే ఉన్న రకుల్ ప్రీత్ అదే చీర కట్టులో గ్లామర్ ప్రదర్శన చేసింది.

సాయి పల్లవి మాత్రం పట్టు చీరలో చాలా ట్రెడిషనల్ గా కనిపించింది. రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి, రకుల్ ఇలా రామాయణ ఈవెంట్ లో మెరిసినా.. సాయి పల్లవి లుక్ మాత్రం తెగ హైలెట్ అవడమే కాదు స్టేజ్ ఏదైనా సాంప్రదాయం ఇంపార్టెంట్ అనేలా సాయి పల్లవి కనిపించింది అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Sai Pallavi makes a stunning appearance in a traditional saree