OG సీక్వెల్ ఇప్పుడప్పుడే లేనట్లే

OG 2 update

 

నిన్నమొన్నటివరకు OG సీక్వెల్ పై PK క్రియేటివ్ వర్క్స్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వచ్చిన ట్వీట్లు చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అయ్యారు. రేపో మాపో OG యూనివర్స్ మొదలైపోతుంది అన్న లెవల్లో వ్యవహారం కనిపించింది. దర్శకుడు సుజిత్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లు OG యూనివర్స్ పై హైప్ కలిగేలా చేసారు.

అంతెందుకు నాని తో ఒప్పుకున్న బ్లడీ రోమియో కూడా పవన్ OG2 తర్వాతే అని అన్నారు. అయితే OG 2 ఇప్పుడప్పుడే పట్టాలెక్కే ఛాన్స్ కనిపించడం లేదు. కారణం పవన్ కళ్యాణ్ ఇప్పుడప్పుడే సుజిత్ కి అందుబాటులోకి వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆయన కుడి భుజానికి సర్జరీ చేసారు. నిన్నే ఆయన డిశ్చార్జ్ అయ్యి ముంబై కోకిలాబెన్ ఆసుపత్రి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు.

పవన్ అప్పుడే కోలుకోలేదు. ప్రస్తుతం సర్జరీ జరిగిన భుజానికి మూడు వారాల తరువాత నుంచి ఫిజియోథెరపీ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఆపరేషన్ చేసిన భుజం సాధారణ స్థితికి చేరుకోవడానికి నాలుగు నెలల సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు.  

అంతేకాదు ఆయన ఎడమ భుజానికి కూడా మరో రెండు నెలల్లో సర్జరీ చెయ్యాలని వైద్యులు చెప్పారు. మరి ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లో ఎలా పాల్గొంటారు. అందుకే అనేది OG సీక్వెల్ కి చాలా టైమ్ పడుతుంది అని. 
 

OG 2