ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Nagarjuna, Chaitanya And Akhil Film Put On Hold

అక్కినేని మల్టీస్టారర్ ఆగిపోయిందా?

Nagarjuna, Chaitanya And Akhil Film Put On HoldNagarjuna, Chaitanya And Akhil Film Put On Hold


అక్కినేని హీరోలంతా మనం లాంటి బ్లాక్ బస్టర్ లో నటించి అక్కినేని అభిమానులకు ఎప్పటికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. మనం చిత్రం అక్కినేని ఫ్యామిలీ కి ఎంతో ప్రత్యేకం. లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు దగ్గర నుంచి అఖిల్ వరకు ఈ చిత్రంలో నటించారు. అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం కావడంతో ఈ మనం చిత్రాన్ని చిన్న పెద్దా అందరూ వీక్షించారు.

ఆతర్వాత అక్కినేని హీరోలు నాగార్జున, నాగ చైతన్యలు కలిసి బంగార్రాజు చిత్రంతో నటించి హిట్ కొట్టారు. ఈ ఏడాది బంగార్రాజు కి సీక్వెల్ ప్రకటించారు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఆ చిత్రాన్ని అక్కినేని మల్టీస్టారర్ అంటే హీరోలు నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ లను కలిపి అక్కినేని మల్టీస్టారర్ గా బంగార్రాజు 2 ని తెరకెక్కించబోతున్నారనే ప్రచారం జరిగింది.

సంక్రాంతికి అక్కినేని సోగ్గాళ్లు థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతున్నారంటూ అన్న‌పూర్ణ స్టూడియోస్ సంస్థ ఫిబ్ర‌వ‌రిలో సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.15 జ‌న‌వ‌రి 2027 సినిమా రిలీజ్ కాబోతుందంటూ ప్ర‌క‌టించారు. తండ్రీ కొడుకుల కాంబినేష‌న్‌లో సినిమా కావ‌డంతో అభిమానుల్లో ఈ మ‌ల్టీస్టార‌ర్‌పై ఆస‌క్తి ఏర్ప‌డింది.

ఆ అనౌన్స్‌మెంట్ త‌ర్వాత ఇప్పటివరకు బంగార్రాజు 2పై ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఈ మ‌ల్టీస్టార‌ర్ మూవీ ఆగిపోయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒకపక్క ఈ సీక్వెల్ కథ నాగార్జునకు నచ్చలేదు అంటుంటే, మరోపక్క అక్కినేని హీరోలు ముగ్గురు వేర్వేరు ప్రాజెక్ట్‌ల‌లో బిజీగా ఉండ‌టంతో బంగార్రాజు 2కు డేట్స్ కేటాయించ‌డం క‌ష్టంగా మారటం వల్లే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది అంటున్నారు. ఏది ఏమైనా ఈ న్యూస్ అక్కినేని అభిమానులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.
 

Akkineni Multistarrer Put On Back Burner