ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Vrushakarma Closes Huge Non-theatrical dea

చైతు వృషకర్మకు బిగ్ డీల్

Vrushakarma Closes Huge Non-theatrical dea

 

తండేల్ తో బిగ్ హిట్ అందుకున్న అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వృషకర్మ అంటూ ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు. ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి.

హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లోనే వృషకర్మ షూటింగ్ చేస్తున్నారు. ఎలాంటి బ్రేక్ లేకుండా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై హైప్ ఎంతగా ఉంది అంటే.. ఈ చిత్రానికి సంబందించిన డిజిటల్ హక్కులు భారీ డీల్ కి అమ్ముడుపోయినట్లుగా తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 వృష్కర్మ ఓటీటీ హక్కులను దక్కించుకుంది అని తెలుస్తుంది.

అది కూడా నాగ చైతన్యు కెరీర్ లోనే హైయ్యెస్ట్ డీల్ అని, దాదాపు రూ. 50 కోట్ల కు జీ 5 వృషకర్మ డిజిటల్ హక్కులు దక్కించుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రంలో చైతు నిధి అన్వేషకుడు అర్జున్ పాత్రలో నటిస్తుండగా, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేస్తోంది.

Jackpot Deal for