ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Did Deepika Padukone post in support of Sonam Wangchuk!

సోనం వాంగ్‌చుక్ మద్దతుపై దీపికా టీమ్ క్లారిటీ!

Did Deepika Padukone post in support of Sonam Wangchuk!

విద్యా వ్యవస్థలో అక్రమాలకు వ్యతిరేకంగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరుతూ నిరసన తెలుపుతున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్‌కు దీపికా ప‌దుకొణే మద్దతుగా నిలుస్తున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ వైర‌ల్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ద‌ళ‌పతి విజ‌య్, ప్ర‌కాష్ రాజ్ మిన‌హా మిగ‌తా సెల‌బ్రిటీలంతా సైలెంట్ గా ఉన్న‌ త‌రుణంలో దీపిక పోస్ట్ తో ఆమె కూడా అండ‌గా ఉన్నార‌నే వార్త రావ‌డం సంచ‌ల‌నంగా మారింది.

అయితే దీపికా ప‌దుకొణే పోస్ట్  పూర్తిగా కల్పితమని వాస్తవ తనిఖీలో తేలింది. దీపికా పదుకొణె తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో సోనం వాంగ్‌చుక్‌కు మద్దతుగా ఎలాంటి  పోస్ట్ చేయలేదని స్పష్టమైంది. ఇన్‌స్టాగ్రామ్ ఫీచర్లు, ఫాంట్ స్టైల్  పోస్ట్ చేసిన విధానాన్ని గమనిస్తే ఎవరో ఉద్దేశపూర్వకంగా దీపికా పేరు మీద ఇలాంటి ఫేక్ స్క్రీన్‌షాట్‌లను సృష్టించి ప్రచారంలోకి తెచ్చారని వెలుగులోకి వ‌చ్చింది. గతంలో కూడా దీపికా పదుకొణెను ఇలాంటి తప్పుడు సమాచారంతో టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి.

సెలబ్రిటీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారి పేరును ఉపయోగించి వివాదాస్పద ... రాజకీయ విషయాల్లో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇలాంటి ఫేక్ పోస్టులను ఆయుధాలుగా వాడుతుంటారు. దీపిక విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు.

సోనం వాంగ్‌చుక్ చేస్తున్న  నిరసన దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువతలో చర్చకు దారితీసింది. వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నా? ప్రభుత్వ స్పందన లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒక వైపు వాస్తవ నిరసన కొనసా గుతుంటే.. మరోవైపు ఇలాంటి తప్పుడు పోస్టులు సృష్టించడం వల్ల అసలు సమస్య పక్కదారి పట్టే ప్రమాదం ఉంది

Deepika Padukone backed Sonam Wangchuk's hunger strike on Instagram