సీఎం సినిమాకి ప్రమోషన్స్ అక్కర్లేదు

Jana Nayagan


సీఎం విజయ్ సినిమాకి ప్రమోషన్స్ అక్కర్లేదు. అంతగా జన నాయగన్ చిత్రంపై భీభత్సమైన క్రేజ్ కనిపిస్తుంది. జన నాయగన్ బుకింగ్స్ ఓపెన్ అవడమే తరువాయి రికార్డ్ స్థాయిలో టికెట్లు తెగిపోయాయి. బుక్ మై షోలో ఈ సినిమా అదిరిపోయే బుకింగ్స్ తో జన నాయగన్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. 
 
బెంగళూరు లాంటి సిటీ లలో ఈ సినిమాకి షాకింగ్ టికెట్ ధరలు ఉన్నప్పటికీ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అది చూసాక సీఎం సినిమాకి ప్రమోషన్స్ ఎందుకు, ఇంత క్రేజ్ ఉండగా అంటున్నారు. అసలు సినిమాని ప్రమోట్ చేసేది.. టికెట్ బుకింగ్స్ కోసం, సినిమాపై హైప్ పెంచేందుకు.

కానీ ఇప్పుడు అలాంటి ప్రమోషన్స్ తో పని లేకుండా విజయ్ జన నాయగన్ చిత్రానికి రికార్డ్ బుకింగ్స్ రావడం విజయ్ ఫ్యాన్స్ కి ఆరు నెలల దిగులు ఒదిలిపోయేలా చేసింది. జన నాయగన్ క్రేజ్ చూసి విజయ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఆరు నెలల ఎదురు చూపులు, ఇలాంటి క్రేజ్ కనిపిస్తే ఆగుతారా..!

Vijay Jana Nayagan