అఫీషియల్: ఫౌజీ రిలీజ్ డేట్ అవుట్

Official: Fauzi release date out

 

అనుకున్నదే అయ్యింది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ చిత్రం ఫౌజీ డిసెంబర్ 3 అంటూ మేకర్స్ అఫీషియల్ గా డేట్ అనౌన్స్ చెయ్యడమే కాదు ఫౌజీ రిలీజ్ డేట్ తో పాటుగా ప్రభాస్ పవర్ ఫుల్ లుక్ ఉన్న పోస్టర్ ని అభిమానుల కోసం వదిలారు. దసరా రిలీజ్ అన్నప్పటికీ షూటింగ్ పెండింగ్ ఉండడంతో ఫౌజీ ని డిసెంబర్ 3కి షిఫ్ట్ చేసారు.

ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ షూటింగ్ కి బ్రేకిచ్చి హను రాఘవపూడి దర్శకత్వంలో పూర్తి కావాల్సిన ఫౌజీ సెట్ లోకి వెళుతున్నారు. ఓ 30 రోజుల పాటు ప్రభాస్ ఫౌజీ కోసం స్పెండ్ చేస్తే ఆయన కేరెక్టర్ కి సంబందించిన షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి అవుతుంది. అందుకే స్పిరిట్ తో పాటుగా కల్కి 2 కి కాస్త విరామమిచ్చి ముందు ఫౌజీ ని ప్రభాస్ కంప్లీట్ చెయ్యబోతున్నారు.

ఆతర్వాత పోస్ట్ ప్రొడక్షన్, సీజీ వర్క్ కి కలిపి మిగతా టైమ్ పడుతుంది. అందుకే డిసెంబర్ 3 అయితే ఫౌజీ కి అనుకూలంగా ఉంటుంది అని ఆ డేట్ ని లాక్ చేసినట్లుగా తెలుస్తుంది. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సోల్జర్ గా పవర్ ఫుల్ రోల్ లో  కనిపించబోతున్నారు.రిలీజ్ డేట్ పోస్టర్ లో ప్రభాస్ శత్రువులను ఊచకోత కోసి రక్తంతో తడిచి చేతిలో కత్తి తో మాసివ్ లుక్ లో కనిపించారు.

ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్ గా కనిపిస్తుంది. రాజాసాబ్ డిజప్పాయింట్మెంట్ మోడ్ లో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఫౌజీ తో బ్యాక్ బౌన్స్ అవ్వాలని చూస్తున్నారు. 

Fauzi's Release Date Poster Is Out