వాళ్లిద్ద‌రు ఇప్పుడేం చేస్తారు? అన్న‌దే ఆస‌క్తి!

Ranveer Singh and Aditya Dhar

`ధురంధర్` ఫ్రాంచైజీతో బాక్సాఫీస్ వద్ద అసాధారణ విజయాలను నమోదు చేసిన జోవీ ర‌ణ‌వీర్ సింగ్- ఆదిత్య‌ధ‌ర్.
ధురంధ‌ర్ సక్సెస్ తర్వాత  తదుపరి ఇద్ద‌రి ప్రయాణం ఎలా ఉండబోతుందనేది సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. రణవీర్ సింగ్  తదుపరి చిత్రంగా జై మెహతా దర్శకత్వంలో `ప్రళయ` అనే భారీ బడ్జెట్ జోంబీ థ్రిల్లర్‌ను ఎంచుకున్న‌ట్లు వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. అదే జ‌రిగితే? ఈ చిత్రం, రణవీర్ కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌గా నిల‌వ‌నుంద‌ని అంటున్నారు.

దర్శకుడు ఆదిత్య ధర్  తదుపరి చిత్రం కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఆయ‌త‌నో ప‌నిచేయ‌డానికి చాలా మంది స్టార్ హీరోలు  క్యూలో ఉన్నారు. కానీ అదిత్య ఏ హీరోని ఎంచుకుంటాడు? అన్న‌దే ఆస‌క్తిక‌రం. ఈ రేసులో టాలీవుడ్ అగ్ర హీరో కూడా ఉన్నారు. ఇప్ప‌టికే ఆదిత్య ధ‌ర్ మౌర్య సామ్రాజ్య నేపథ్యంతో ఓ చారిత్రక డ్రామా  సిద్దం చేస్తున్న‌ట్లు  ప్ర‌చారంలో ఉంది. అలాగే `అశ్వత్థామ` టైటిల్ తో ఓ సినిమా చేసే అవ‌కాశాలున్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే వీటిలో హీరోలు ఎవ‌రు? అన్న‌దే ఆస‌క్తిక‌రంగా మారింది. ఆదిత్య కూడా ఇంత‌వ‌ర‌కూ హీరోల విష‌యంలో ఎక్క‌డా స్పందించ‌లేదు. రెండు సినిమాల‌కు  సంబంధించి స్టోరీలు లీక్ అవ్వ‌డం త‌ప్ప హీరోలు సంగ‌తేంటి? అన్న‌ది ఊహ‌కి కూడా రానంత గోప్య‌త వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం ర‌ణ‌వీర్ సింగ్-ఆదిత్య ధ‌ర్ ఇద్ద‌రు రెస్ట్ మోడ్ లో ఉన్నారు. `ధ‌రుంధ‌ర్` కోసం ఎంతో వేగంగా ప‌నిచేసి  చాలా అల‌స‌ట‌కు గుర‌య్యారు. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రి కొత్త‌ ప్రాజెక్ట్ 2027లోనే ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంది.
 

Ranveer Singh and Aditya Dhar