అఖిల్ కి రూ.100 కోట్లు గిఫ్ట్ వస్తుందా?
Lenin Success Celebrations highlights
అక్కినేని అఖిల్.. లెనిన్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చేసినట్లే. పదేళ్లుగా కష్టపడుతున్నా ఈ రేంజ్ హిట్ అందుకోలేకపోయిన అఖిల్ ని లెనిన్ హిట్టు నిలబెట్టినట్టే. అఖిల్ కూడా లెనిన్ హిట్ తో జోష్ లో కనిపిస్తున్నాడు. నిన్న బుధవారం సాయంత్రం గుంటూరులో జరిగిన లెనిన్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో అఖిల్ భార్య తో కలిసి పబ్లిక్ అప్పీరియన్స్ ఇచ్ఛాడు.
ఆ ఈవెంట్ లో తన సినిమాకి వాయిస్ వార్ ఇచ్చిన ఎన్టీఆర్ కి మనస్ఫూర్తిగా థాంక్స్ కూడా చెప్పాడు. అయితే లెనిన్ చిత్రంతో హిట్ ఇచ్చే బాధ్యత నాగార్జున మాత్రమే కాదు నిర్మాత నాగవంశీ కూడా తీసుకున్నారు. సితార-అన్నపూర్ణ కలిసి లెనిన్ ని నిర్మించాయి. తాజాగా లెనిన్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో నాగవంశీ అఖిల్ గురించి మాట్లాడారు.
నాగవంశీ అఖిల్ కి రూ.100 కోట్ల సినిమాని గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాను అంటూ ప్రకటించడం అక్కినేని అభిమానులను ఎగ్జైట్ అయ్యేలా చేసింది. అయితే లెనిన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో రూ.100 కోట్ల క్లబ్బులోకి వెళుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి లెనిన్ లాంగ్ రన్ లో లెనిన్ రూ.100 కోట్ల క్లబ్బులోకి వెళుతుందేమో చూడాలి.
ఇక లెనిన్ బ్రేక్ ఈవెన్ పై కూడా నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. లెనిన్ బ్రేక్ ఈవెన్ పై సందేహాలకు గుంటూరు డిస్ట్రిబ్యూటర్స్ తీరుస్తారంటూ వారిని స్టేజ్ పైకి పిలిచి మరీ వారితోనే నాగవంశీ చెప్పించడం అభిమానులను ఇంప్రెస్స్ చేసింది.







































